వర్షం వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ఎడ్లబండిని ఢీకొన్న బైక్.. రైతు మృతి.. నిర్మల్ లో ఘటన

Published : Jun 29, 2023, 04:10 PM IST
వర్షం వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ఎడ్లబండిని ఢీకొన్న బైక్.. రైతు మృతి.. నిర్మల్ లో ఘటన

సారాంశం

నిర్మల్ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రైతు మరణించాడు. వర్షం కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆ రైతు నడుపుతున్న బైక్.. ఓ ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న ఎడ్లబండిని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నడుపుతున్న రైతు తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొల్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఛీ.. వీళ్లు అసలు తల్లిదండ్రులేనా ? రూ. 40 వేల కోసం.. 27 ఏళ్ల వ్యక్తికి 12 ఏళ్ల కూతురి విక్రయం

కుభీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన 40 ఏళ్ల దొడ్డికింది వెంగళరావ్ అనే రైతు నివసిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి ఓ వ్యక్తిని తన బైక్ పై ఎక్కించుకొని మాలేగాం గ్రామంలో విడిచిపెట్టాడు. తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే అదే సమయంలో వర్షం మొదలైంది. దీంతో ఆయనకు రోడ్డు సరిగా కనిపించలేదు.

ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించొద్దు - విద్యాశాఖ కీలక ఆదేశాలు

అయినప్పటికీ బైక్ ను నడుపుతూనే ఉన్నాడు. అలాగే అంతర్ని గ్రామ సమీపంలోకి చేరుకున్నాడు. అయితే ఆ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఓ ఎడ్లబండి నిలిపి ఉంచిన విషయం ఆయనకు తెలియలేదు. నేరుగా వెళ్లి ఆ ఎడ్లబండిని ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.

బక్రీద్ రోజున జంతువులను అక్రమంగా వధించొద్దు - బాంబే హైకోర్టు
 
వెంటనే స్థానికులు వెంగళరావ్ ను భైంసా ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు నితిన్ ఉన్నారు. నితిన్ అమెరికాలో నివసిస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు అంత్యక్రియలు జపకూడదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?