తెలంగాణలో 12 వేలు దాటిన కరోనా: ఒక్క రోజులో 985 కేసులు, ఏడుగురి మృతి

By Siva KodatiFirst Published Jun 27, 2020, 12:01 AM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా 985 మందికి పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,349కి చేరుకుంది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా 985 మందికి పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,349కి చేరుకుంది. వైరస్‌తో ఇవాళ ఏడుగురు మరణించడంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237కు చేరింది.

శుక్రవారం 78 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో... ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,766కు చేరుకుంది. ప్రస్తుతం 7,436 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 4,374 మంది నమూనాలను పరీక్షించారు.

Also Read:నాలుగు రోజుల్లో రిటైర్మెంట్: కరోనాతో చెస్ట్ ఆసుపత్రి హెడ్ నర్సు మృతి

అత్యధికంగా జీహఎచ్ఎంసీ పరిధిలో 774 మందికి పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 53, వరంగల్ అర్బన్ 20, మెదక్ 9, ఆదిలాబాద్ 7, నాగర్‌కర్నూల్ 6, నిజామాబాద్ 6, రాజన్న సిరిసిల్ల 6, సిద్ధిపేట 3, ములుగు 2, వికారాబాద్ 1, జగిత్యాలలో 2, జయశంకర్ భూపాలపల్లి 3, ఖమ్మం 3, యాదాద్రి భువనగిరి 2, మిర్యాలగూడలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. 

కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 407 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 4,90,401కి చేరుకొన్నాయి. వీటిలో 1,89,463 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 2,85,637 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:మూతపడుతున్న దుకాణాలు: జనరల్ బజార్, బేగం బజార్, రాణిగంజ్ మూత

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 1.47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు సుమారు 7 వేల మంది మరణించారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో 73 వేల మందికి కరోనా సోకింది. సుమారు 2400 మంది మరణించారు.

click me!