నాలుగు రోజుల్లో రిటైర్మెంట్: కరోనాతో చెస్ట్ ఆసుపత్రి హెడ్ నర్సు మృతి

By narsimha lode  |  First Published Jun 26, 2020, 5:33 PM IST

హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న జయమణి కరోనాతో శుక్రవారం నాడు కరోనాతో మరణించారు. 20రోజుల క్రితం వరకు ఆమె కరోనా విధులు నిర్వహించారు



హైదరాబాద్: హైద్రాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న జయమణి కరోనాతో శుక్రవారం నాడు కరోనాతో మరణించారు. 20రోజుల క్రితం వరకు ఆమె కరోనా విధులు నిర్వహించారు.

చెస్ట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న జయమణికి కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.  కరోనా కారణంగా ఆమె భర్త కూడ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Latest Videos

undefined

ఈ నెల 30వ తేదీతో జయమణి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో ఆమె కరోనా బారినపడ్డారు. చివరి రోజుల్లో కూడ ఆమె కరోనా రోగుల సేవల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

also read:గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కార్యాలయంలో కరోనా: ముగ్గురికి కోవిడ్

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాటికి కరోనా కేసులు 11,364కి చేరుకొన్నాయి. గురువారం నాడు ఒక్క రోజే రాష్ట్రంలో కరోనా కేసులు 920 రికార్డయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.

గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి కూడ కరోనా సోకింది. వీరిని చికిత్స కోసం తరలించారు. వైద్యులు, వైద్య సిబ్బందికి కూడ  కరోనా సోకింది.

click me!