అన్ని నిధులూ కాళేశ్వరానికే.. ఆఖరికి కరోనావి కూడా: కేసీఆర్ సర్కార్‌పై అరవింద్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 26, 2020, 8:25 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కాళేశ్వరానికే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కాళేశ్వరానికే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.

శుక్రవారం అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రతి ఏటా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలకు కేంద్రం రూ.50 కోట్లు ఇస్తుందని ఎంపీ తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి  వచ్చిన రూ.200 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు.

ఆర్‌ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో నిధులను కాళేశ్వరానికి మళ్లించారని ఆయన విమర్శించారు. చివరికి కరోనా నిధులను కూడా ఆ ప్రాజెక్ట్‌కే తరలించారని అరవింద్ ఆరోపించారు. వలస కార్మికులకు ఇచ్చిన నిధులను అధికార పార్టీ నేతలు మింగేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో 14 వేల వలస కార్మికులను గుర్తించి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. నాసిరకం సొయా విత్తనాలు సరఫరా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలను నట్టేట ముంచిందని అరవింద్ మండిపడ్డారు. 

click me!