
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ది ఓ ప్రత్యేక స్థానం. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచమొత్తానికి చాటిచెప్పిన అపూర్వ సందర్భం అది. నేటితో ఆ అరుదైన ఘటన చోటుచేసుకొని ఆరేళ్లవుతోంది.
ఈ సందర్భంగా ఆ రోజు జరిగినా ఘటనలను ఒకసారి మననం చేసుకుందాం.
2011 మార్చి 10 న మిలియన్ మార్చ్ కు జేఏసీ సిద్ధమైంది. అరబ్ లో తేహ్రీ స్వ్కేర్ ముట్టడిని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ మిలియన్ మార్చ్ కు పథక రచన చేశారని అంటుంటారు.
అయితే మార్చి 10 వ తేదీనే ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఈ ఉద్యమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి వ్యతిరేకత వచ్చింది. పేరెంట్స్ అసోసియేషన్ మిలియన్ మార్చ్ పై కోర్టులో కేసు కూడా వేసింది.
ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదిలాయి.
మార్చ్ ను పూర్తిస్థాయిలో అణగదొక్కాలని నాటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జిల్లాల్లో నేతల నిర్భందం, పారా మిలిటరీ దళాల పహారా, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు ఏవీ ఉద్యకారులను ఆపలేకపోయాయి.
ఇంటలిజెన్స్ కూడా కనిపెట్టలేనంత పక్కాగా తెలంగాణ వాదులు ఆ రోజు ట్యాంక్ బండ్ కు అనూహ్యంగా చేరుకున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఓ చోట ఉత్తుత్తి పెళ్లి జరిపి అక్కడి నుంచే న్యూ డెమెక్రసీ నేతలు మొదట ట్యాంకు బండ్ పైకి వచ్చారు. ఆ తర్వాత ప్రభంజనం మొదలైంది. ఉప్పెనలా వచ్చిన ఉద్యమకారులను ఆపే సహాసం పోలీసులు కూడా చేయలేకపోయారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మార్చ్ ను అణగదొక్కాలని కుతంత్రాలు చేయడంతో ఉద్యమకారులు ట్యాంక్ బండ్ పై రెచ్చిపోయారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాపైనా తమ ఆగ్రహాన్ని వెళ్లగగ్గారు. ఈ టీవీ కి చెందిని డీఎస్ఎన్ జీ వాహనాన్ని దగ్ధం చేశారు. జర్నలిస్టులను కూడా చితకబాదారు. వీడియో కెమెరాలను హుస్సెన్ సాగర్ లో పడేశారు.
మిలియన్ మార్చి కు ముందే చాలా మంది నేతలను జేఏసీ చైర్మన్ కోదండరాం ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హారీష్ రావు తన సహచర ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో కలిసి బోట్ లో హుస్సేన్ సాగర్ మధ్య నుంచి ట్యాంక్ బండ్ కు చేరడానికి ప్రయత్నించారు. మధ్యలో పోలీసులు అడ్డుపడటంతో నీటిలో దూకుతామంటూ బెదిరించారు.
ట్యాంక్ బండ్ పైకి వచ్చిన నాటి కాంగ్రెస్ నేతలు కేకే, ఎంపీ మధుయాష్కీల కార్లపై ఉద్యమకారులు దాడులకు దిగారు. ఉద్యమకారులను అరెస్టు చేయడం, మార్చ్ ను అడ్డుకోవడాన్ని సహింలేక కొందరు ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలపై తమ ప్రతాపం చూపారు.
అయితే ఈ విగ్రహ విధ్వంసానికి కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యాలు అద్దడం తెలంగాణ వాదులను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
మిలియన్ మార్చ్ కు వ్యూహరచన చేసిన కేసీఆర్ తీరిగ్గా సాయంత్రం నాలుగు తర్వాత ట్యాంక్ బండ్ కు చేరుకోవడంతో ఆయన కూడా జనాల ఆగ్రహానికి గురికాకతప్పలేదు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ కు చేరుకున్న మహిళనేతలే ఆయనపై విమర్శల వర్షం గుప్పించారు. పోతన విగ్రహం వద్ద కేసీఆర్ మిలియన్ మార్చ్ కు వచ్చిన వారినుద్దేశించి మాట్లాడారు.
మిలియన్ మార్చిలో జరిగిన విగ్రహాల ధ్వంసాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కానీ, విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాక్షాలు లభించలేదు.
విగ్రహాల విధ్వంసం తర్వాత ట్యాంక్ బండ్ మీద కొమరం భీం లాంటి తెలంగాణ హీరోల విగ్రహలు అక్కడ కొత్తగా చేరాయి.
టీ జేఏసీ తర్వాత చేపట్టిన సాగరహారానికి మిలియన్ మార్చి స్ఫూర్తిగా నిలిచింది.
మిలియన్ మార్చ్ ఘటనను బీబీసీ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించింది.
http://http://http://www.bbc.com/news/world-south-asia-12699113
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం, మిలియన్ మార్చ్ తన ఆలోచనే అని చెప్పుకొనే సీఎం కేసీఆర్ ఈ రోజును కనీసం గుర్తు చేసుకోకపోవడం గమనార్హం.