హైద్రాబాద్ పరిధిలో 3931 పోలింగ్ కేంద్రాలు: రోనాల్డ్ రాస్

By narsimha lode  |  First Published Oct 9, 2023, 10:12 PM IST

 హైద్రాబాద్ పరిధిలో 18 చెక్ పోస్టులు హైద్రాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్  రోస్ తెలిపారు. 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని  హైద్రాబాద్ పరిధిలో 3931 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా  జీహెచ్ఎంసీ కమిషనర్, హైద్రాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ చెప్పారు.

సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో  హైద్రాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ జిల్లా పరిధిలో  44, 42, 458 ఓటర్లున్నారన్నారు. ఇందులో 22 లక్షల 79వేల 617 మంది పురుష ఓటర్లున్నారన్నారు. 21 లక్షల 62 వేల 541 మంది మహిళా ఓటర్లున్నారని రాస్ తెలిపారు.  టాన్స్ జెండర్లు 300 మంది ఉన్నారన్నారు. హైద్రాబాద్ జిల్లా పరిధిలో 3,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. హైద్రాబాద్ పరిధిలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని రోనాల్డ్ రాస్  వివరించారు.

Latest Videos

undefined

also read:ఓటు నమోదుకు ఈ నెల 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను  ఇవాళ విడుదలైంది. ఈ వచ్చే నెల  30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్  3న  ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని  అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజకీయ పార్టీల  ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో 34,452  మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా రాస్ తెలిపారు.

click me!