సీపీఐ, సీపీఎంలకు రెండు అసెంబ్లీ సీట్లు: కాంగ్రెస్ నిర్ణయం

సీపీఐ, సీపీఎంలకు  రెండేసి అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్  పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.ఈ విషయమై  లెఫ్ట్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


హైదరాబాద్: సీపీఐ, సీపీఎంలకు  రెండు అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా  ప్రచారం సాగుతుంది. ఈ విషయమై  లెఫ్ట్ పార్టీలకు  కాంగ్రెస్ నాయకత్వం సమాచారం పంపింది.ఈ విషయమై  రేపు సీపీఐ, సీపీఎంలు  సంయుక్త సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో  లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  అయితే లెఫ్ట్ పార్టీలకు  ఒక్కొక్క స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.ఈ ప్రతిపాదనపై  కమ్యూనిష్టు పార్టీలు  అంగీకరించలేదు. దీంతో సీపీఐ, సీపీఎంలకు  రెండేసి స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.ఈ సమాచారాన్ని లెఫ్ట్ పార్టీలకు  కాంగ్రెస్ నాయకత్వం పంపింది.  ఇవాళ సీపీఐ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైద్రాబాద్ లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీపీఎం కూడ  కాంగ్రెస్ ప్రతిపాదనపై పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉంది. 

Latest Videos

మునుగోడు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను  సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుందని సమాచారం.  మిర్యాలగూడ, భద్రాచలం అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుంది. భద్రాచలంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరయ్యను  పినపాక నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతుంది.  కాంగ్రెస్ ప్రతిపాదనపై లెఫ్ట్ పార్టీలు అంగీకరిస్తాయా లేదా చూడాలి. రేపు సీపీఐ, సీపీఎంలు సమావేశం కానున్నాయి.ఒక్కో పార్టీకి కనీసం నాలుగు అసెంబ్లీ స్థానాలు కావాలని గతంలో సీపీఐ,సీపీఎంలు కాంగ్రెస్ నాయకత్వం వద్ద ప్రతిపాదించాయి.  లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఖరారు చేసే అంశాన్ని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించింది. 

also read:తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు: లెఫ్ట్, బీఎస్పీతో భట్టి పొత్తు చర్చలు

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడ పొత్తు ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. కానీ, బీఆర్ఎస్ కు చెందిన  115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. తమ పార్టీలతో పొత్తున్నప్పటికీ  తమతో చర్చించకుండా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంపై  లెఫ్ట్ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ  నేతలు  లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

 


 

click me!