తెలంగాణలో ఎన్నికల కోడ్: పోలీసుల తనిఖీలు, హైద్రాబాద్‌లో ఏడు కిలోల బంగారం సీజ్

By narsimha lode  |  First Published Oct 9, 2023, 8:31 PM IST

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిజాంకాలేజీ వద్ద భారీగా బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు.
 



హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా   పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరో వైపు హైద్రాబాద్ లోని పలు చోట్ల పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  

సోమవారంనాడు రాత్రి నిజాం కాలేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు 300 కిలోల వెండిని కూడ సీజ్ చేశారు. బంగారం, వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని  పోలీసులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

 ఏడు కిలోల బంగారంతో  పాటు బంగారు ఆభరణాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో  పోలీసులు సీజ్ చేశారు. హైద్రాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.  మరో వైపు హైద్రాబాద్  గచ్చిబౌలి గోపన్ పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న కుక్కర్లను సీజ్ చేశారు పోలీసులు.కుక్కర్లపై కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ స్టిక్కర్లను  పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్ ఫిలింనగర్ లో మద్యం సీసాలను  పోలీసులు సీజ్ చేశారు.వనస్థలిపురంలో వాహనాల తనిఖీల్లో రూ. 4 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 11.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద  బైక్ పై వెళ్తున్న వ్యక్తి నుండి పోలీసులు నగదును సీజ్ చేశారు. షాద్ నగర్ కు చెందిన ఆశోక్ అనే వ్యక్తి నుండి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఈ డబ్బుకు సరైన పత్రాలు లేకపోవడంతో  నగదును సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపితే నగదును అప్పగిస్తామని పోలీసులు ప్రకటించారు.

click me!