తెలంగాణలో కాస్త తెరిపినిచ్చిన కరోనా: కొత్తగా 27 కేసులు, 1,661కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published May 20, 2020, 9:18 PM IST
Highlights

గత కొద్దిరోజులుగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఉద్ధృతి కాస్త తగ్గింది. బుధవారం రాష్ట్రంలో 27 కొత్త కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

గత కొద్దిరోజులుగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఉద్ధృతి కాస్త తగ్గింది. బుధవారం రాష్ట్రంలో 27 కొత్త కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,661కి చేరుకుంది. ఇందులో 1,013 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు చనిపోవడంతో మరణాల సంఖ్య 40కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 608 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇవాళ నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీలో, 12 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. వీరితో కలిపి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి వైరస్ సోకినట్లయ్యింది.

ఇప్పటి వరకు తెలంగాణలో వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కోవిడ్ 19 కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులూ నమోదు కాలేదు. 

Also Read:=కరోనా హాట్‌స్పాట్‌గా భారత్: ప్రెస్‌మీట్లకు రాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, విమర్శలు

ఇక కరోనా మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.2 శాతం మంది మరణించగా, భారత్‌లో 0.2 శాతం మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని ఆయన ప్రకటించారు.

కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని.. లాక్‌డౌన్ -1 ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, లాక్‌డౌన్-2 సమయంలో 11.42 శాతం, తర్వాత అది 26.59 శాతానికి పెరిగి, ప్రస్తుతం 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.

Also Read:కరోనా వైరస్: భారత్‌కు బిగ్ రిలీఫ్.... మన దగ్గర మరణాల 0.2 శాతమే

ప్రస్తుతం దేశంలో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని... 42,298 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారని ఆయన చెప్పారు. కాగా గత 24 గంటల్లో 1,07,609 కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఇక రాష్ట్రాల వారీగా 31,136 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, గుజరాత్ (12,140), తమిళనాడు (12,448), ఢిల్లీ (10,554) తర్వాతి స్థానంలో ఉన్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు 1,06,750 మందికి కరోనా సోకింది. 

click me!