నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు

Published : May 20, 2020, 04:44 PM ISTUpdated : May 20, 2020, 04:47 PM IST
నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు

సారాంశం

మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి  ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి  ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. 

ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. 

ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ టాగ్​ నిబందనలు పాటించాల్సి ఉంటుంది.  డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో  ఫాస్ట్​ టాగ్​​ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది.  

కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు(రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్​ఆర్​పై కార్లను అనుమతించడం జరగదు. 

ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తించిన స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హహెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది