రాజ్యాంగ విరుద్దం: ప్రైవేట్లో టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక కామెంట్స్

By narsimha lodeFirst Published May 20, 2020, 4:36 PM IST
Highlights

కరోనా పరీక్షలను గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలోనే  చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.


హైదరాబాద్: కరోనా పరీక్షలను గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలోనే  చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు విచారణ నిర్వహించారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ల్యాబ్ లో డబ్బులు చెల్లించి పరీక్షలు నిర్వహించుకోవడం ప్రజల హక్కు అని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్య్ పై నమ్మకం లేకపోతే ఆరోగ్య శ్రీ సేవలకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.కరోనా పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్  ఐసీఎంఆర్ కు ధరఖాస్తు చేసుకోవవాలని హైకోర్టు ఆదేశించింది.

also read:హైద్రాబాద్‌లో ఎంగేజ్ మెంట్ కు హాజరైన 15 మందికి కరోనా: వరుడి తండ్రి మృతి

ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్ లో వైద్య సిబ్బంది, సదుపాయాలను పరిశీలించి ఐసీఎంఆర్ నోటిఫై చేయాలని హైకోర్టు సూచించింది.ఐసీఎంఆర్ సూచించిన ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్ కు మాత్రమే కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కూడ హైకోర్టు సూచించింది.

 ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్ లో కరోనా పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ రంగంలోనే పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోతే ప్రైవేట్ కు అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

click me!