తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒకరు కరోనాతో మరణించారు. 3,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 883 మంది ప్రయాణికులు ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి దిగారు. వీరికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా ఐదుగురికి పాజిటివ్ తేలింది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఆ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది.
హైదరాబాద్: కరోనా వైరస్(Coronavirus) ఒమిక్రాన్(Omicron) కేసులు కలవరం పెడుతున్న సందర్భంలో కరోనా కేసులు ఒక్కటి నమోదైనా భయాలు నెలకొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వెల్లడించింది. కాగా, ఈ మహమ్మారి కారణంగా ఒకరు మరణించారు. ప్రస్తుతం Telangana రాష్ట్రంలో కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతూ లేదా ఐసొలేషన్‌లో ఉన్న వారి సంఖ్య 3,547గా ఉన్నది. కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 210 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వివరాలతో రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 6,80,413కి పెరగ్గా, కరోనా మరణాలు 4,019కి చేరాయి. కాగా, ఈ ఒక్క రోజు 35,037 మందికి కరోనా టెస్టులు చేశారు.
నేడు కరోనా కేసుల బులెటిన్ రాగానే.. ఒమిక్రాన్ కేసుల వివరాలు వెతికే పరిస్థితి ఉన్నది. అయితే, తాజాగా, రాష్ట్రంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒమిక్రాన్ ముప్పు ఉన్న దేశాల నుంచి ఈ రోజు 883 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో దిగారు. వీరందరికీ శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేశారు. ఇందులో ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ తేలిన వారి సంఖ్య 5. ఎట్ రిస్క్ దేశాల నుంచి వీరు వచ్చినందున ఈ ఐదుగురి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అయితే, ఈ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మన రాష్ట్రంలో మొత్తం 75 శాంపిళ్లు పంపారు. ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. పది మంది ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డ పేషెంట్లు కోలుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
undefined
Also Read: తెలంగాణ: కొత్తగా 177 మందికి కరోనా.. హైదరాబాద్‌లో అత్యధికం, రాష్ట్రంలో పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు
రాష్ట్రంలో మొత్తం 162 కరోనా కేసులు నమోదైతే.. అందులో సగం అంటే.. 81 కేసులు రాజధాని నగరం హైదరాబాద్‌లోనే రిపోర్ట్ అయ్యాయి. ఆ తర్వాత అత్యధిక కేసులు రంగారెడ్డిలో రిపోర్ట్ అయ్యాయి. రంగారెడ్డిలో గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనా బారిన పడ్డారు. హనుమకొండలో పది మందికి కరోనా పాజిటివ్ తేలింది. మేడ్చల్ మల్‌కజ్‌గిరి, నల్గొండలో ఎనిమిదేసి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.24.12.2021 at 5.30pm) pic.twitter.com/E1XYR4VTWZ
కరోనా లక్షణాలు మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఉన్న పేషెంట్లు.. వారికి కరోనా పాజిటివ్ అని తేల్చిన రిపోర్టులు లేకున్నా సరే.. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ కొవిడ్ హాస్పిటల్‌లో అడ్మిట్ కావచ్చునని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడే టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడానికి అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు వివరించింది. అవసరాన్ని బట్టి పడకను కేటాయించడం, ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటాయని వివరించింది.
Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభణ.. కొత్తగా 20 మందికి నిర్ధారణ, సెంచరీ దాటిన కేసులు
శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో కలిపి నేటికి 358 మొత్తం ఒమిక్రాన్ కేసులు అయ్యాయని, 144 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health and family welfare) కార్యదర్శి రాజేష్ భూషణ్ (rajesh bhushan) తెలిపారు.