హిమాన్షు శరీరాకృతిపై తీన్మార్ మల్లన్న పోల్.. కేటీఆర్ సీరియస్, నడ్డాకి ఫిర్యాదు

By Siva KodatiFirst Published Dec 24, 2021, 10:30 PM IST
Highlights

బీజేపీ నేతలపై (bjp) మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr). తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

బీజేపీ నేతలపై (bjp) మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr).  తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు (himanshu ) శరీరంలోనా..? అంటూ ’’ తీన్మార్‌ మల్లన్న (teenmar mallanna) పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్‌ షా (amit shah) కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా అర్థంలేని విషయాలను ప్రచారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

 

Sri Ji,

Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?

You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v

— KTR (@KTRTRS)
click me!