తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,590 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,902కి చేరింది.
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,590 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,902కి చేరింది.
ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 295కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 10,904 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 12,703 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
undefined
Also Read:శవాల మీద చిల్లర ఎరుకునే బాపతు : కరోనాతో ఓ వ్యక్తి మృతి, బిల్లు కడితేనే మృతదేహం
ఆదివారం ఒక్క హైదరాబాద్‌లోనే 1,277 మందికి కోవిడ్ సోకగా.. ఆ తర్వాత మేడ్చల్ 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి 19, మహబూబ్‌నగర్ 19, నల్గొండ 14, కరీంనగర్, వనపర్తిలలో నాలుగేసి, మెదక్, నిజామాబాద్‌లలో మూడేసి, నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి, జనగామలల రెండేసి, గద్వాల, సిద్ధిపేట, వరంగల్ రూరల్, ఆదిలాబాద్, నారాయణ్‌పేట, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
కాగా, కోవాక్సిన్ వ్యాక్సిన్ ను ఈ నెల 7వ తేదీ నుండి నిమ్స్ లో రోగులపై ప్రయోగించనుంది.ఈ మేరకు డీసీజీఐ అనుమతి లభించింది. ఆగష్టు 15వ తేదీ నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.
Also Read:విజృంభిస్తున్న కరోనా: కేసీఆర్ ఎక్కడ...?
కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ తెలిపారు. దేశంలోని 12 సంస్థల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లో నిమ్స్ సంస్థను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.
మూడు రకాల వ్యాక్సిన్ ను రెండు డోసుల చొప్పున కరోనా రోగులపై ప్రయోగించనున్నారు. ఈ వ్యాక్సిన్ లో కూడ 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఇస్తారు. రెండు దఫాలు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. తొలి దఫా 28 రోజులు నిర్వహించనున్నారు.