శవాల మీద చిల్లర ఎరుకునే బాపతు : కరోనాతో ఓ వ్యక్తి మృతి, బిల్లు కడితేనే మృతదేహం

Siva Kodati |  
Published : Jul 05, 2020, 07:22 PM ISTUpdated : Jul 05, 2020, 07:30 PM IST
శవాల మీద చిల్లర ఎరుకునే బాపతు : కరోనాతో ఓ వ్యక్తి మృతి, బిల్లు కడితేనే మృతదేహం

సారాంశం

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రులు ఈ వైరస్‌ బారినపడిన వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రులు ఈ వైరస్‌ బారినపడిన వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి.

చికిత్సకు అయిన బిల్ కడితే కానీ మృతదేహాలను అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్పోరేట్ హాస్పిటల్ ఇలాగే వ్యవహరించింది. లక్షల రూపాయల బిల్లులు వేసి కడితే కానీ విడిచిపెట్టమని బెదిరిస్తున్నాయి.

Also Read:విజృంభిస్తున్న కరోనా: కేసీఆర్ ఎక్కడ...?

జూన్ 25న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో నిమ్మ బసవ నాగరాజు అనే వ్యక్తి జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన శనివారం ప్రాణాలు కోల్పోయారు.

అయితే మొత్తం 7 లక్షల 20 వేల రూపాయల బిల్లు వేశారు. నాలుగు లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ అయ్యిందని మిగిలిన 3 లక్షల 20 వేలు చెల్లిస్తే కానీ మృతదేహాన్ని ఇవ్వమని సిబ్బంది బెదిరిస్తున్నారు.

Also Read:ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు డాక్టర్ సుల్తానా తరలింపు: చర్యలకు ఈటల ఆదేశం

అంతేకాకుండా తమ కుటుంబాన్ని నిర్బంధించి వేధిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు నాగరాజుకు ఇతర వ్యాధులేవి లేవని హార్ట్, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డికి, కేసిఆర్ కి ఒకేసారి ఇచ్చిపడేసిన కవిత | Asianet News Telugu
వారంలో ఒక్కరోజే ఉండే హైదరాబాద్ చోర్ బజార్. ఎక్కడుంది.? ఎలా వెళ్లాలి.? రూ. 3 వేలకు ఐఫోన్ ఏంటి అసలు