హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటళ్లో రేవ్ పార్టీ: అరెస్ట్ అయిన వారిలో మంత్రి బంధువు..?

Siva Kodati |  
Published : Jul 05, 2020, 07:56 PM ISTUpdated : Jul 05, 2020, 08:48 PM IST
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటళ్లో రేవ్ పార్టీ: అరెస్ట్ అయిన వారిలో మంత్రి బంధువు..?

సారాంశం

కరోనా వేళ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటళ్లో రేవ్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటళ్లో రేవ్ పార్టీ జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు

కరోనా వేళ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటళ్లో రేవ్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటళ్లో రేవ్ పార్టీ జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అర్థరాత్రి సమయంలో హోటల్‌పై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఉక్రెయిన్‌కు చెందిన ఒక విదేశీ యువతి కూడా ఉన్నట్లుగా సమాచారం.

గతంలో జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన డాట్ పబ్ యజమాని సంతోష్ రెడ్డి సూత్రధారని తేలింది. గతంలో ఓ  పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిన సంతోష్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు.

మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి సమయంలో పార్టీ చేసుకోవడంతో అందుకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ మంత్రి బంధువొకరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు