తెలంగాణలో 50 వేలకు చేరువలో కరోనా: కొత్తగా 1,554 కేసులు, తొమ్మిది మరణాలు

By Siva Kodati  |  First Published Jul 22, 2020, 10:05 PM IST

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది


తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది.

ఇవాళ కరోనా కారణంగా తొమ్మిది మరణించడంతో మృతుల సంఖ్య 438కి చేరుకుంది. బుధవారం 1,281 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటి వరకు 37,666 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 842 మందికి పాజిటివ్‌గా తేలింది.

Latest Videos

undefined

ఆ తర్వాత రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, కరీంనగర్ 73, నల్గొండ 51, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిజామాబాద్ 28, మెదక్ 25, పెద్దపల్లి 23, సూర్యాపేట, కామారెడ్డిలో 22, సిరిసిల్ల 18, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ 14, మహబూబాబాద్ 11, యాదాద్రి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎనిమిది చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Also Read:61 ఆసుపత్రుల్లో చికిత్సలు, 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు: హైకోర్టుకు తెలంగాణ సర్కార్

రాష్ట్రంలో గత 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.రాష్ట్రంలో కరోనా కట్టడికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు 2.08 లక్షల శాంపిళ్లను పరీక్షించగా వాటిలో 39,342 కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.

కరోనా సోకిన వారిలో 66 శాతం మంది కోలుకొన్నారని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. గతంలో 10 లక్షల మందిలోనూ 2,515 మందికి పరీక్షలు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం5,961 మందికి పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

Also Read:ఆక్స్‌ఫర్డ్ బాటలో హైదరాబాద్ సైతం: నిమ్స్‌ క్లినికల్ ట్రయల్స్‌లో తొలి విజయం

జీహెచ్ఎంసీ పరిధిలోని 300 హెల్త్ సెంటర్లు, జిల్లాల్లోని 870 పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పరీక్షల నిర్వహణకు అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ ల్యాబ్ లు అవసరం రాదని ప్రభుత్వం తెలిపింది.

13 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వం వివరించింది. కరోనా టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు రెండు రోజుల క్రితం ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 

click me!