కిడ్నీ రాకెట్‌లో కొత్త ట్విస్ట్: బెంగళూరులోనూ లింకులు.. 100 మంది బాధితులు..?

By Siva KodatiFirst Published Jul 22, 2020, 6:56 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఉద్యోగం 2014లో దినేష్ అనే యువకుడు కొలంబోకి వెళ్లాడు. కొలంబోలో కిడ్నీ రాకెట్ చేతికి చిక్కాడు. నాలుగు లక్షలకు కిడ్నీ అమ్ముకున్న దినేశ్‌కు వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

అయితే ఈ దందా లింకులు కొన్ని బెంగళూరులోనూ బయటపడ్డాయి. నగరానికి చెందిన డాక్టర్ మానిక్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మానిక్ పరారీలో ఉన్నారు.

Also Read:తెలంగాణ టు కొలంబో... హైదరాబాద్ లో బయటపడ్డ కిడ్నీ రాకెట్

కాగా ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో వెంకటేశ్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా చేతిలో 100 మంది అమాయకులు బలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రధాన సూత్రధారిని పట్టుకుంటేనే ఈ కిడ్నీ రాకెట్ ముఠా డొంక కదులుతుందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. 

click me!