తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా 14 కేసులు, 38కి చేరిన బాధితుల సంఖ్య

Siva Kodati |  
Published : Dec 22, 2021, 09:55 PM IST
తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా 14 కేసులు, 38కి చేరిన బాధితుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకున్నాయి. ఈ 14 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకున్నాయి. ఈ 14 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

రాజధాని హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో బుధవారం ఓ యువకుడికి (23ఏళ్లు) ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సూడాన్ నుండి ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నిర్దారణ కాగానే సదరు యువకుడిని గచ్చబౌలిలోని టిమ్స్ కు తరలించారు. అలాగే అతడు నివాసమున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కాలనీలో శానిటేషన్ చేపట్టారు. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు...  కాలనీలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి నాగజ్యోతి తెలిపారు. 

ALso Read:Telangana Omicron Cases: హైదరాబాద్ లో మరో యువకుడికి ఒమిక్రాన్... 25కు చేరిన కేసులు

మరోవైపు భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases In India) సంఖ్య 200 మార్కును దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry)ప్రకటించింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినవారిలో 90మది కోలుకున్నట్టుగా తెలిపింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల నుంచి బయటపడినవే. ఈ రెండు రాష్ట్రాలు ఒమిక్రాన్ కేసుల్లోనూ, రికవరీలోనూ మొదటి రెండు స్థానాల్లో వున్నాయి. ఆ తర్వాత కేసుల విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. అయితే ఇప్పటివరకు ఒక్కరు కూడా రికవరీ కాలేదు.  
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu