సీఎస్ సోమేశ్ కుమార్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. జరిమానా విధింపు

By Siva Kodati  |  First Published Dec 22, 2021, 9:39 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (telangana chief secretary) ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌పై (somesh kumar) హైకోర్టు (telangana high court) అసహనం వ్యక్తం చేసింది. రూ.10 వేలు జరిమానా విధించడంతోపాటు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (telangana chief secretary) ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌పై (somesh kumar) హైకోర్టు (telangana high court) అసహనం వ్యక్తం చేసింది. రూ.10 వేలు జరిమానా విధించడంతోపాటు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం 2016లో జారీ చేసిన 123 జీవోను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నాలుగేళ్లుగా ప్రతీ విచారణలో హైకోర్టు ఆదేశిస్తోంది. 

Also Read:సోమేష్ కుమార్ కు కేసీఆర్ అందలం: కారణాలు ఇవీ...

Latest Videos

కౌంటరు దాఖలు చేయాలని లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను గత నవంబర్‌లోనూ న్యాయస్థానం మరోసారి ఆదేశించింది. దీనిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్లు దాఖలు చేయకపోగా.. కనీసం హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ సైతం దాఖలు చేయలేదంటూ సోమేశ్ కుమార్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జరిమానాగా విధించిన రూ.10 వేలను ప్రధానమంత్రి కొవిడ్ సహాయ నిధికి  చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 24కు వాయిదా వేసింది.  

click me!