పదమూడేళ్లకే కిలిమంజారో అధిరోహించిన హైదరాబాద్ చిన్నారి..

By AN TeluguFirst Published Nov 16, 2021, 9:52 AM IST
Highlights

ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని హైదరాబాద్ కు చెందిన మురికి పులకిత హస్వీ అనే పదమూడేళ్ల చిన్నారి అధిరోహించింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి సాహసాన్ని చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ఇది ఒక సాహసోపేతమైన అనుభవం అంటుందీ చిన్నారి...

ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని హైదరాబాద్ కు చెందిన మురికి పులకిత హస్వీ అనే పదమూడేళ్ల చిన్నారి అధిరోహించింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి సాహసాన్ని చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ఇది ఒక సాహసోపేతమైన అనుభవం అంటుందీ చిన్నారి.... 

హైదరాబాద్ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక స్కేల్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె ఏఎన్ఐతో మాట్లాడుతూ, మురికి పులకిత హస్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.  Mount Kilimanjaroని స్కేల్ చేయడంలో తన అనుభవాన్ని పంచుకుంది.

"ఇది ఒక సాహసోపేతమైన అనుభవం అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మీకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుభవంలోకి వస్తాయి. అలాంటి అద్భుతమైన ప్రదేశం కిలిమంజారో పర్వతం" అని ఆమె చెప్పింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ జరిగిన తర్వాత... మూడు నెలల ముందు నుంచే ఈ పర్వతారోహణకు సన్నద్ధం అయ్యానని Muriki Pulakita Hasvi వివరించారు.

"బేస్ క్యాంప్ పూర్తి చేసిన తర్వాత, మొత్తం ఏడు శిఖరాగ్రాలను అధిరోహించాలని నేను అనుకున్నాను. నాలోని తపనను అప్పుడు నేను గ్రహించాను. దీనికి తగ్గట్టుగానే సిద్ధం అవ్వడం మొదలుపెట్టాను’’ అని ఆమె జోడించింది.

వీటన్నింటిలో నేను నేర్చుకున్నదేమిటంటే పర్వతారోహణకు మానసికంగా దృఢంగా ఉండాలి. కాబట్టి మానసికంగా నిలదొక్కుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటి అన్నింటినీ చేసేదాన్ని. 

తన భవిష్యత్ లక్ష్యాల గురించి Ms హస్వి మాట్లాడుతూ, "2024 కంటే ముందుగానే నేను మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను. దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నాను. దీని కోసం, ఇప్పటికే అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను" అని తెలిపింది.

"యువతకు నా సందేశం ఏమిటంటే.. ప్రతీ ఒక్కరూ పర్వతాలు అధిరోహించాలని నేను చెప్పను. కానీ వారి జీవితాల్లో ఎదురయ్యే ఎత్తుపళ్లాలనే పర్వతాలను వారు సమర్తవంతంగా అధిరోమించాలని చెప్పడమే నా ఉద్దేశం’ అని ఆమె చెప్పుకొచ్చింది ఆ చిన్నారి. 

నివేదా థామస్‌ సాహసం.. కిలిమంజారో అధిరోహణ

కాగా, 2021, మార్చ్ లో ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఆచంట ఉమేష్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కిలిమంజారో శిఖరాగ్రం అయిన ఉహురు పీక్ లో జాతీయ జెండాను ఎగురవేసినందుకు చాలా ఆనందం కలిగిందని పవన్ తెలిపారు.

'ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని'  అనే కవి వాక్కులను ఉమేష్ నిజం చేశారని ఆయన కొనియాడారు. ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఉమేష్ హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉమేష్‌ను పవన్ శాలువతో సత్కరించారు. పర్వతారోహణ కోసం తీసుకున్న శిక్షణ, కిలిమంజారో దగ్గరి వాతావరణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాజమండ్రికి చెందిన ఉమేష్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడని, పర్వతారోహణలో ప్రత్యేక శిక్షణ పొందారని తెలిపారు.

మార్చి 20, 2021న మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించాడని తెలిసి సంతోషించానని చెప్పారు. పర్వత శిఖరాగ్రానికి చేరుకోవడానికి దాదాపు ఆరు రోజులు పడుతుందని.. ఈ ప్రయాణం అత్యంత కష్టమైనదని పవన్ అన్నారు.

అనేక అడ్డంకులు అధిగమించి ఉహురు పీక్ కు చేరుకోవడం అద్భుతమని పవన్ ప్రశంసించారు. పర్వతారోహణ అనేది అత్యంత కష్టమైనది... వాతావరణంలోని మార్పులను తట్టుకొని పర్వతాన్ని ఆధిరోహించాలని చెప్పారు.
 

click me!