Local body MLC Elections: పోటీపై కాంగ్రెస్ తర్జన భర్జన, రేపు కీలక ప్రకటన

By narsimha lodeFirst Published Nov 15, 2021, 8:07 PM IST
Highlights

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి పట్టున్న నల్గొండ జిల్లాలో పోటీ చేయాలా వద్దా అనే విషయమై తర్జన భర్జన పడుతుంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం సోమవారం నాడు జరిగింది.

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే తర్జన భర్జనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సోమవారం నాడు  జరిగింది. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశంలో నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇవాళ జూమ్ యాప్ ద్వారా  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చించారు.  రాష్ట్రంలోని Local body MLC ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.

 దీంతో ఈ ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతలు చర్చించారు.నల్గొండలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఈ సమావేశంలో చర్చించారు.  ఈ విషయమై జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రకటించారు. అయితే మరోమారు  ఈ విషయమై చర్చించేందుకు మంగళవారం నాడు సమావేశం కావాలని నిర్ణయిం తీసుకొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి.Nalgonda జిల్లా నుండి గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తేర చిన్నపరెడ్డి విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. గతంలో ఎమ్మెల్సీగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేయడంతో జరిగిన ఎన్నికల్లో చిన్నపరెడ్డి విజయం సాధించారు.Mla కోటా Mlc ఎన్నికల్లో పోటీకి Congress పార్టీకి బలం లేదు. ఆ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు Trsస్ లో చేరారు. తెలంగాణ అసెంబ్లీలో విపక్ష స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఎంఐఎం ఈ స్థానాన్ని భర్తీ చేసింది.రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ  స్థానాలు అధికార టీఆర్ఎస్ కే దక్కే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

also read:Mlc Elections:ప్రగతి భవన్ నుండి ఏడుగురికి పిలుపు, మాజీ స్పీకర్ కు రాని ఆహ్వానం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయంతో  కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకి రాజకీయంగా కలిసి రానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

టీఆర్ఎస్ ను దెబ్బకొట్టే సత్తా ఏ పార్టీకి ఉందనే విశ్వాసం ప్రజలకు కలిగితే  టీఆర్ఎస్ వ్యతిరేక ఓటంతా ఆ పార్టీ వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది. అయితే ప్రజల్లో ఈ విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం కోసం బీజేపీ నాయకత్వం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇదే విషయమై పోటీలో ఉంది.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం ఆ పార్టీ శ్రేణులను నిరాశపర్చింది. ఈ స్థానంలో జానారెడ్డిని ఓడించి నోముల నర్సింహ్మయ్య యాదవ్ తనయుడు విజయం సాధించిన విషయం తెలిసిందే.

click me!