100 నియోజకవర్గాల్లో 100 భారీ బ‌హిరంగ స‌భ‌లు.. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కేసీఆర్ ప‌క్కా స్కెచ్ !

Hyderabad: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే గెలుపు వ్యూహాల‌ను సిద్ధం చేసి సీఎం కేసీఆర్.. 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.
 

100 huge public meetings in 100 constituencies, KCR's sketch for victory in Telangana Assembly Elections 2023 RMA

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ లు అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాయి. ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే గెలుపు వ్యూహాల‌ను సిద్ధం చేసి సీఎం కేసీఆర్.. 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అక్టోబర్, నవంబర్ నెలల్లో 100 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తుందనే అంచనాతో పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ ఈ మేర‌కు కేసీఆర్ బహిరంగ సభల షెడ్యూల్ ను ఖరారు చేస్తోందని తెలిసింది. ఉత్తరాది జిల్లాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దక్షిణాది జిల్లాలకు మంత్రి హరీశ్ రావు ఇన్ చార్జిలుగా వ్యవహరించ‌నున్నార‌ని స‌మాచారం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్రచారం చేసే బాధ్యతను కూడా కేటీఆర్ కు అప్పగించనున్నారు.

Latest Videos

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలపై హరీష్ రావు దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతలను అప్పగిస్తారనీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు పార్టీ అధినేత పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగ‌స్టు 20న సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించి నెల రోజులు దాటింది. ఈ నెల 16న కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించినప్పటికీ అది నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ ప్రారంభోత్సవానికి హాజరయిన క్ర‌మంగా చూడ‌వ‌చ్చు.

అక్టోబర్ 16న వరంగల్ లో ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఇడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. పేదలు, మహిళల కోసం ప్రత్యేక ప్యాకేజీతో కూడిన పత్రాన్ని రూపొందించే పనిలో బీఆర్ ఎస్ మేనిఫెస్టో కమిటీ నిమగ్నమైంది. గత గురువారం పేదలకు 2బిహెచ్ కె ఇళ్ల పంపిణీ అనంతరం హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పేదలు, మహిళలకు ప్రత్యేక ప్యాకేజీలను మేనిఫెస్టోలో ప్రకటిస్తామని కేటీఆర్ సంకేతాలిచ్చారు. స్వ‌యంగా సీఎం కేసీఆర్ పేద‌ల కోసం అనేక విష‌యాలు ప్ర‌క‌టిస్తార‌ని కూడా చెప్ప‌డంపై ఆస‌క్తి నెల‌కొంది. బీఆర్ఎస్ ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తుందనీ, త్వరలోనే చంద్రశేఖర్ రావు ప్రకటిస్తారని, కాంగ్రెస్ ఆరు హామీలను నమ్మొద్దని ప్రజలను కోరారు.

vuukle one pixel image
click me!