ప్రభుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పి.. ఉద్యోగార్థులకు నష్టపరిహారమివ్వాలి : TSPSC Group-1 ర‌ద్దుపై డీకే అరుణ

By Mahesh Rajamoni  |  First Published Sep 24, 2023, 3:32 PM IST

Hyderabad: గ్రూప్-1 క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీ దేవి శనివారం అనుమతించారు. పరీక్షను ర‌ద్దు చేసి మ‌ళ్లీ  నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ స్పందిస్తూ ఉద్యోగ ఆశావహులకు పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  


BJP national vice president DK Aruna: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దు నేపథ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు  గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ పార్టీ స్పందిస్తూ.. కేసీఆర్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌వ‌ల్ల ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయ‌ని విమ‌ర్శించింది. గ్రూప్-1 క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీ దేవి శనివారం అనుమతించారు. ఈ క్రమంలోనే పరీక్షను ర‌ద్దు చేసి మ‌ళ్లీ  నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ స్పందిస్తూ ఉద్యోగ ఆశావహులకు పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సానుభూతి లేదని ఆమె ఆరోపించారు. లక్షలాది రూపాయలను ఆదా చేసేందుకు టీఎస్‌పీఎస్సీ బయోమెట్రిక్‌ విధానాన్ని ఉపయోగించకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని ఆమె విమ‌ర్శించారు.

Latest Videos

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మద్యం షాపుల కేటాయింపు నోటిఫికేషన్‌ మినహా ఎలాంటి నోటిఫికేషన్‌ సక్రమంగా విడుదల కాలేదనీ, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల నిర్వహణ పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసినందుకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న టీఎస్‌పీఎస్సీని పూర్తిగా పునరుద్ధరించాలనీ, పదేపదే జరుగుతున్న పొరపాట్లకు అధికారులను బాధ్యులను చేసి శిక్షించాలని పేర్కొన్నారు. అసలు రిక్రూట్‌మెంట్ జరగకుండా యువతను మభ్యపెట్టేందుకు నోటిఫికేషన్లతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని ఆరోపించారు.

అలాగే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ తన కుటుంబ ఉపాధికి ప్రాధాన్యతనిచ్చారు. అందుకే లక్షలాది మంది గ్రూప్‌-1 ఆశావహుల కలలను ఛిన్నాభిన్నం చేశారు. యువతకు, నిరుద్యోగులకు కేసీఆర్ చేస్తున్న తీవ్ర అన్యాయానికి ఇదే నిదర్శనం" అని టీఎస్‌పీఎస్సీ  గ్రూప్-1 ర‌ద్దుపై  స్పందించారు.

click me!