అక్టోబర్ తొలి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా: జాబితాలో చోటు వీరికే...

By narsimha lode  |  First Published Sep 24, 2023, 3:53 PM IST


ఈ ఏడాది అక్టోబర్ తొలి వారంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో 40 నుండి  45  మంది పేర్లు ఉండే అవకాశం ఉంది.
 



హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్దం చేసుకుంటుంది.అక్టోబర్ మొదటి వారంలో  అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో  45 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఎలాంటి ఇబ్బందులు లేని  అభ్యర్థుల పేర్లను  ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 22,23 తేదీల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీతో  తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే  ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అభ్యర్థుల ఎంపిక విషయంపై రెండు వర్గాల నేతలకు టిక్కెట్ల కేటాయింపు విషయమై  ఈ వాదనలు జరిగినట్టుగా  సమాచారం.

ఈ ఏడాది చివరలో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే  అభ్యర్ధులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని భావిస్తుంది.ఈ మేరకు  అభ్యర్థుల ఎంపికకు కసరత్తును చేస్తుంది. ఈ నెల 22,23 తేదీల్లో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో  50 నుండి  60 మంది అభ్యర్ధుల ఎంపిక పూర్తైంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక కోసం మరోసారి స్క్రీనింగ్ కమిటీ  సమావేశం కానుంది. 

Latest Videos

undefined

అయితే తొలి జాబితాలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు  ఎలాంటి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.  మరో వైపు ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి కూడ టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నాయకత్వం సానుకూలంగా ఉంది.  అయితే  పార్టీలో చేరిన నేతలు కోరుకుంటున్న సీట్ల కేటాయింపుపై  చర్చిస్తున్నారు.

అక్టోబర్ తొలి వారంలో  ప్రకటించే 45 అసెంబ్లీ సీట్లలో బీసీ అభ్యర్ధుల సంఖ్య కూడ ఎక్కువగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  జాగ్రత్తలు తీసుకుంటుంది.రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్లు కోసం ధరఖాస్తు చేసుకున్న   జాబితా షార్ట్ లిస్ట్  పై స్క్రీనింగ్ కమిటీ చర్చించింది.  అంతేకాదు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఏ అభ్యర్థులకు గెలుపు అవకాశాలున్నాయనే విషయమై  సునీల్ కనుగోలు నివేదికను కూడ స్క్రీనింగ్ కమిటీ  పరిగణనలోకి తీసుకుందనే సమాచారం.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(నల్గొండ)
రేవంత్ రెడ్డి (కొడంగల్)
జగ్గారెడ్డి(సంగారెడ్డి)
షబ్బీర్ అలీ(కామారెడ్డి)
సంపత్ కుమార్(ఆలంపూర్)
గడ్డం ప్రసాద్(వికారాబాద్)
సీతక్క(ములుగు)
ఉత్తమ్ కుమార్ రెడ్డి(హుజూర్ నగర్)
శ్రీధర్ బాబు(మంథని)
వంశీచంద్ రెడ్డి(కల్వకుర్తి)
మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం)
విజయరమణారావు(పెద్దపల్లి)
లక్ష్మణ్ కుమార్(ధర్మపురి)
దామోదర రాజనర్సింహ(ఆంథోల్)
మల్లు భట్టి విక్రమార్క(మధిర)
జీవన్ రెడ్డి(జగిత్యాల)
జి.వినోద్(బెల్లంపల్లి)
ఫిరోజ్ ఖాన్(నాంపల్లి)
ప్రేంసాగర్ రావు(మంచిర్యాల)
 ఇటీవలనే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏఏ అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాలనే దానిపై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి పోటీకి  తుమ్మల నాగేశ్వరరావు  ఆశిస్తున్నారు. వైఎస్ఆర్‌టీపీని  కాంగ్రెస్ లో విలీనం చేయాలని చేయాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు.అయితే  అదే జరిగితే  తెలంగాణలోని పాలేరు నుండి పోటీకి షర్మిల  భావిస్తున్నారు.  షర్మిల ఈ స్థానం నుండి  పోటీకి దిగితే  ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే  మరో వైపు  కొత్తగూడెం నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది.  కొత్తగూడెం టిక్కెట్టును  సీపీఐ కోరుతుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఉంటే కొత్తగూడెం సీటును  సీపీఐ వదులుకోకపోవచ్చు.  దీంతో  ఖమ్మం జిల్లాకు చెందిన  నేతలకు ఏ సీట్లను కేటాయించనున్నారో త్వరలోనే తేలనుంది.

 

click me!