కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా: 57 మంది మృతి

By narsimha lodeFirst Published Sep 11, 2018, 12:00 PM IST
Highlights

కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడి 57 మంది మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.

జగిత్యాల: కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడి 57 మంది  మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది. మృతుల్లో 32 మంది పురుషులు, 15 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఆర్టీసి చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రమాదమని చెబుతున్నారు. 

జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు నుండి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 88 మంది ప్రయాణీస్తున్నారు. మృతులు చాలా వరకు శనివారంపేట, సింహంపేట గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు.

మంగళవారం నాడు కొండగట్టు వద్ద ఆలయానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలోనే కొండగట్టు ఘాట్ రోడ్డు నుండి కిందకు దిగుతుండగా బస్సు  వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు..అదే సమయంలో బస్సు బ్రేకులు కూడ ఫెయిలైనట్టుగా చెబుతున్నారు. దీంతో ప్రమాదం జరిగిందని భావించారు.

"

బస్సు నాలుగు పల్టీలు కొట్టింది. బస్సులోని చిక్కుకొన్న వారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బస్సు  పల్టీలు కొట్టడంతో ముందు బాగం నుజ్జునుజ్జైంది. బస్సులో ముందు భాగంలో కూర్చొన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి ముందు భాగంలో కూర్చొన్నవారే ఎక్కువగా గురయ్యారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బస్సు ప్రమాద బాధితులను ఆదుకొంటామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని కూడ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహాదారిపైకి.. ఇంతలోనే ఇలా...

click me!