సీఐ దురుసు ప్రవర్తన.. గణేశ్ విగ్రహాలను నేలకేసికొట్టి ఆగ్రహం (వీడియో)

By sivanagaprasad KodatiFirst Published Sep 11, 2018, 11:34 AM IST
Highlights

వినాయక విగ్రహాలను విక్రయించే దుకాణదారుడితో ట్రాఫిక్ సీఐ దురుసుగా ప్రవర్తించమే కాకుండా.. గణేశ్ విగ్రహాలను నేలకేసి కొట్టిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

వినాయక విగ్రహాలను విక్రయించే దుకాణదారుడితో ట్రాఫిక్ సీఐ దురుసుగా ప్రవర్తించమే కాకుండా.. గణేశ్ విగ్రహాలను నేలకేసి కొట్టిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. లంగర్‌హౌస్‌లోని బాపునగర్‌ బస్టాప్‌ వద్ద గల రోడ్డుపై ఓ వ్యక్తి గణపతి విగ్రహాలను అమ్మకానికి పెట్టాడు. ఈ సమయంలో ఇవాళ అటుగా వెళుతున్న ట్రాఫిక్ సీఐ శివచంద్రా స్టాల్ యజమాని దగ్గరకు వెళ్లి... నీ కారణంగా ట్రాఫిక్‌ జామ్ అవుతుంది.. వేరే చోటికి వెళ్లి అమ్ముకోవాలని హెచ్చిరించారు.

దీంతో స్టాల్ యజమాని బక్రీద్ సందర్భంగా రోడ్ల మీదే మేకలను అమ్ముతారు ... అప్పుడు ట్రాఫిక్ జామ్ కాలేదు కానీ నేను విగ్రహాలను అమ్మితే ట్రాఫిక్ జామ్ అవుతుందా అని సీఐని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ నన్నే ప్రశ్నిస్తావా అంటూ వాగ్వివాదానికి దిగాడు..

తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. 5 గణపతి విగ్రహాలను నేలకేసి కొట్టాడు. దీనిని గమనించిన స్థానిక హిందు ప్రతినిధులు అక్కడికి చేరుకుని.. హిందువుల మనోభావానలు దెబ్బతీసే విధంగా సీఐ ప్రవర్తించారని.. అతనిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

"

click me!