Telangana Assembly Elections 2023 : పోసాని నోట వచ్చింది జగన్ మాటేనా... తెలంగాణలో వారి మద్దతు ఆ పార్టీకేనా..? 

By Arun Kumar PFirst Published Nov 27, 2023, 2:58 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వైసిపి నేత, ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ఓటుహక్కు కలిగిన సీమాంధ్రులంతా బిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరారు.  

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వుంటారు ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలే కాదు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలో వారిచుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీనుండి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది. ఇదే క్రమంలో వైసిపి బిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందా అంటే అవుననే సమాధానం ఈ పార్టీ శ్రేణుల నుండి వస్తోంది. తాజాగా సినీనటుడు, వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి సీమాంధ్రులు బిఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని కోరడం ద్వారా వైసిపి మద్దతు ఎవరికో స్పష్టంగా బయటపడింది.  

Latest Videos

తెలంగాణ ఏర్పాటుతర్వాత తీవ్ర ఆందోళనలో వున్న సీమాంధ్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని పోసాని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రులు కేసీఆర్ పాలనలో ఎలాంటి అభద్రతాభావం లేకుండా జీవిస్తున్నారని అన్నారు. సెటిలర్లు అనే పదమే వినిపించడంలేదని... తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని పోసాని పేర్కొన్నారు. 

ఇక తెలంగాణ అభివృద్ది కేసీఆర్ పాలనలో శరవేగంగా జరుగుతోందని అన్నారు. చాలా తక్కువ సమయంలో హైదరాబాద్ ఈ స్థాయి అభివృద్ది సాధించడం గొప్పవిషయమని అన్నారు. హైదరాబాద్ ను చూస్తుంటే ఏ న్యూయార్క్ నో చూసినట్లు వుందని... ఇది బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని  పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. 

Read More  telangana elections 2023 : నేనేం తప్పు మాట్లాడలేదు.. నా వల్ల రైతుబంధు ఆగలేదు.. : హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు కులమతాలకు అతీతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పోసాని కోరారు. మనల్ని కాపాడిన కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని... ప్రతిఒక్కరు బిఆర్ఎస్ కే ఓటేయాలని పోసాని కృష్ణమురళి తెలంగాణలోని సీమాంధ్రులను కోరారు.  

click me!