పేదల తరఫున మాట్లాడినందుకే ఈటలను బయటకు పంపారు - హుజూరాబాద్ సభలో అమిత్ షా..

Published : Nov 27, 2023, 02:15 PM IST
పేదల తరఫున మాట్లాడినందుకే ఈటలను బయటకు పంపారు - హుజూరాబాద్ సభలో అమిత్ షా..

సారాంశం

ఈటల రాజేందర్ పేదల తరుఫున మాట్లాడాడని, అందుకే ఆయనను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజురాబాద్ లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఓ కుటుంబం నుంచి సీఎం అవుతారని అన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని హామీ ఇచ్చారు.

వాహనాల్లో నుంచి రోడ్లపైకి కరెన్సీ నోట్లు వెదజల్లిన యువకులు.. వీడియో వైరల్..

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ ను గెలిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. పేదల తరుపున మాట్లాడినందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకున్నారని అన్నారు. అందుకే పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.


బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని అమిత్ షా ఆరోపించారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ నే సీఎం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని కేసీఆర్ అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని అన్నారు.

uttarkashi tunnel collapse : ఉత్తరకాశీ టన్నెల్... విరిగిన డ్రిల్ తొలగింపు.. నేటి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తీసి వేస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.60 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. వరి ధాన్యానికి రూ.3100 మద్దతు ధర ఇస్తామని ఆయన అన్నారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు