Rythu Bandhu: రైతు బంధు పంపిణీకి అనుమతివ్వండి: ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి

By Mahesh K  |  First Published Nov 27, 2023, 2:42 PM IST

రైతు బంధు పథకం కింద నిధులు రైతులకు అందకుండా ఆపొద్దని తాజాగా ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. చాన్నాళ్ల నుంచి అమల్లో ఉన్న ఈ పథకం కింద డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించడం సరికాదని పేర్కొంది. ఈసీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది.
 


హైదరాబాద్: రైతు బంధు పంపిణీ రేపు పడతాయని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఈసీ బ్రేక్ వేసింది. దీంతో మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే.. ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భారత రాష్ట్ర సమితి కోరింది. రైతు బంధు నిధుల పంపిణీకి బ్రేక్ వేసే నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని భావించడం సరికాదని పేర్కొంది. రైతు బంధు పథకం పాతదే అని, కాబట్టి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని తెలిపింది. ఎన్నికల కోడ్ కారణంగా రైతులకు పెట్టుబడి సాయంగా అందే డబ్బులను ఆపేయడం సమంజసం కాదని తన విజ్ఞప్తిలో బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. ఈ నిర్ణయంపై ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని కోరింది.

ఎన్నికలకు ముందు రైతు బంధు నిధులు విడుదల చేయవద్దని, ఈ నిధుల పంపిణీ కూడా ఓటర్లపై ప్రభావం చూపుతుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. కానీ, బీఆర్ఎస్ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఈ నిధులు ఆపేస్తే రైతులపై ప్రభావం పడుతుందని తెలిపింది. చాన్నాళ్లుగా అమల్లో ఉన్న ఈ పథకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదని బీఆర్ఎస్ సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఈ డబ్బులు రైతులకు పడాల్సి ఉన్నది. కానీ, ఇంతలో ఎన్నికల సంఘం తన నిర్ణయం పై యూటర్న్ తీసుకుంది. అన్ని రూపాల్లో ఎన్నికల నియమావళి ముగిసే వరకు రైతు బంధు నిధుల పంపిణీ జరగదని ఈసీ పేర్కొంది.

Latest Videos

undefined

Also Read: telangana elections 2023 : నేనేం తప్పు మాట్లాడలేదు.. నా వల్ల రైతుబంధు ఆగలేదు.. : హరీష్ రావు

రైతు బంధు నిధుల పంపిణీని ప్రచారం చేసుకోవద్దని ఎన్నికల సంఘం కండీషన్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్ రావు రైతు బంధును ప్రచారం చేశారని ఈసీ పేర్కొంటూ యూటర్న్ తీసుకుంది. మంత్రి హరీశ్ రావు రైతు బంధు పథకాన్ని ప్రచారం చేయలేదని, కేవలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు మాత్రమే తెలిపాడని బీఆర్ఎస్ తాజాగా ఈసీకి సమర్పించిన మెమోరాండంలో పేర్కొంది. సోమవారం ఓ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ మంగళవారం రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు.

click me!