Telangana Assembly elections 2023: వీవీప్యాట్,ఈవీఎంలలో తప్పుడుగా ఓటు రికార్డైతే ఏం చేయాలి?

By narsimha lode  |  First Published Nov 28, 2023, 1:31 PM IST

ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అతి కీలకమైంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు రాజకీయ పార్టీలు అష్టకష్టాలు పడుతుంటాయి.అయితే  ఓటు తాము కోరుకున్న అభ్యర్ధికి లేదా పార్టీకి పడిందా కూడ తెలుసుకొనే వెసులుబాటు వీవీప్యాట్ ద్వారా ఉంది.


న్యూఢిల్లీ: ఓటు వేసిన తర్వాత  ఈవీఎంకు అనుసంధానం చేసిన వీవీప్యాట్ లో ఓటరు నమోదు చేసిన ఓటు  ఏడు సెకన్లపాటు కన్పిస్తుంది. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా  రికార్డైతే  వెంటనే  ఎన్నికల అధికారికి  ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.   బ్యాలెట్ పత్రంపై ఉన్న  అభ్యర్థి లేదా పార్టీ గుర్తును తప్పుగా చూపితే  వెంటనే పోలింగ్ స్టేషన్ లో ఉన్న  ప్రిసైడింగ్ అధికారి లేదా ఇంచార్జీకి సమాచారం ఇవ్వాలి.

ఎన్నికల కమిషన్ రూల్స్  1961 49 ఎంఏ  ప్రకారంగా ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా  ఫిర్యాదు చేయాలి.ఈ విషయమై  టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు.  ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచామని తేలితే  దాని పరిణామాల గురించి  కూడ వివరిస్తారు.

Latest Videos

undefined

also read:Barrelakka...కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ: ఎవరీ బర్రెలక్క?

ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు  టెస్ట్ ఓటు నిర్వహిస్తారు.  ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.  ఓటరు  చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే  వెంటనే  రిటర్నింగ్ అధికారికి  ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో  పోలింగ్ ను నిలిపివేస్తారు. రిటర్నింగ్ అధికారి  నిర్ణయం మేరకు  నిర్ణయం తీసుకుంటారు. 

also read:telangana assembly Elections 2023: టెండర్ ఓటు అంటే ఏమిటీ?

ఇదిలా ఉంటే  ఈ ఆరోపణ తప్పని తేలితే  ప్రిసైడింగ్ అధికారి  ఫారం  17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు.తాము  వేసిన ఓటు తాము అనుకున్న అభ్యర్ధికే పడిందా లేదా  తెలుసుకొనేందుకు  వీవీప్యాట్ లేదా ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్  ట్రయల్ పేపర్ ట్రయల్ ప్రింట్ చేస్తుంది.

also read:Telangana Assembly Elections 2023:ఓటేశాక చూపుడు వేలికి సిరా, హైద్రాబాద్‌లోనే తయారీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.  ఈ ఎన్నికల్లో  మూడో దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ దూరమైంది. దీంతో ఈ ఎన్నికల్లో  అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. దక్షిణాదిలో  తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ  ముందుకు సాగుతుంది.


 

click me!