MLC KAVITHA : కాంగ్రెస్‌ పార్టీ మొసలి కన్నీరు నమ్మొద్దు.. పదేళ్లలో ఎంతో డెవలప్ చేశాం - ఎమ్మెల్సీ కవిత

By Asianet News  |  First Published Nov 28, 2023, 12:05 PM IST

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మళ్లీ తమ పార్టీకి ఓటు వేసి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.


కాంగ్రెస్‌ పార్టీ (congress party) మొసలి కన్నీరును నమ్మకూడదని బీఆర్ఎస్ ( BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. ఆ పార్టీ కార్చే కన్నీళ్లు నమ్మితే కన్నీళ్లు మిగులుతాయని చెప్పారు. నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు.

కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

Latest Videos

undefined

తెలంగాణ ప్రభుత్వం ఇళ్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు అందిస్తోందని చెప్పారు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పారు. మళ్లీ ఇంకో సారి అధికారం ఇవ్వాలని, అలా చేస్తే మరెంతో అభివృద్ధి జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేవలం నిరుద్యోగ కాంగ్రెస్ నాయకుల సమావేశాలు జరిగాయని విమర్శలు చేశారు. 

andhra pradesh rains : ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు వర్షాలే.. ఎక్కడెక్కడంటే ?

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందులో ఇప్పటి వరకు 1 లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని తెలిపారు. ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. అందులో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయని అన్నారు. ఐటీ రంగంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పది లక్షల ఉద్యోగాలను సృష్టించామని ఆమె చెప్పారు. 

Telangana Elections 2023 : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయండి.. ఈసీ

గల్ప్ కార్మికులను కూడా ఆదుకుంటామని కవిత అన్నారు. వారి కోసం కొత్త పాలసీని ప్రకటిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ రూ.5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. 

click me!