Telangana Assembly Elections 2023:ఓటేశాక చూపుడు వేలికి సిరా, హైద్రాబాద్‌లోనే తయారీ

By narsimha lode  |  First Published Nov 28, 2023, 11:27 AM IST

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలికి ఉపయోగించే సిరా హైద్రాబాద్‌లో తయారౌతుంది.  ప్రపంచంలోని వంద దేశాలు ఈ సిరాను  ఉపయోగిస్తున్నాయి. 


హైదరాబాద్: ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత  చూపుడువేలికి  ఉపయోగించే సిరాను  హైద్రాబాద్‌లో తయారౌతుంది.  దేశంతో పాటు  ప్రపంచంలోని పలు దేశాలకు ఈ సిరాను  సరఫరా చేస్తున్నారు.  ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలికి ఈ సిరాను ఉపయోగిస్తారు.

ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా  ఇండెలబుల్ ఇంక్ ను ఉపయోగిస్తారు.   

Latest Videos

undefined

ఇండెలబుల్ ఇంక్ లో సుమారు  15 నుండి  18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో  ఈ సిరా  కొన్ని రోజుల వరకు  చెరిగిపోకుండా ఉంటుంది.  దొంగఓట్లు నమోదు కాకుండా ఉండేందుకు గాను  ఈ సిరాను  చూపుడు వేలికి అంటిస్తారు. 

పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత  వాడే సిరాను  దేశంలో రెండు సంస్థలు తయారు చేస్తున్నాయి.  కర్ణాటకలోని  మైసూర్ పెయింట్స్ వార్షిస్ లిమిటెడ్ సంస్థ, హైద్రాబాద్ లోని రాయుడు లాబోరేటరీస్  సంస్థలు తయారు చేస్తున్నాయి. ప్రపంచంలోని వందకి పైగా దేశాలు  హైద్రాబాద్ రాయుడు లాబోరేటరీస్ తయారు చేసే  ఇండెలబుల్ ఇంక్ ను ఉపయోగిస్తున్నాయి.  

మరోవైపు  భారత ఎన్నికల సంఘం  మాత్రం  మైసూర్ పెయింట్స్ అండ్ వార్షిష్ లిమిటెడ్ సంస్థ  తయారు చేసే సిరాను  ఉపయోగిస్తుంది.  ఈ ఇండెలబుల్ సిరా  72 నుండి  96 గంటల పాటు చెరిగిపోకుండా ఉంటుంది.  
ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్కను అంటిస్తారు.  ఒకవేళ  ఈ వేలికి దెబ్బతగిలితే, అసలు వేలు లేకపోతే  వేరే వేలికి  సిరాచుక్క అంటిస్తారు.ఈ దఫా ఓటరు సహాయకుడికి  కుడి చేతి చూపుడు వేలికి కూడ సిరాను అంటిచాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

దొంగ ఓట్లు వేయకుండా నిరోధించేందుకు  గాను  1962లో ఈ తరహా ఇంక్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీ ఫార్మూలాతో  ఈ ఇంక్ తయారీని  రాయుడు లాబోరేటరీ  తయారు చేస్తుంది. ఒక లీటర్  ఇంక్ ధర రూ. 12 వేలు ఉంటుంది.1962లో అప్పటి  ఎన్నికల కమిషనర్  సుకుమార్ సేన్ ఈ సిరాను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. 

also read:Barrelakka...కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ: ఎవరీ బర్రెలక్క?

దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు  ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ  సిరాను ఉపయోగిస్తారు.పల్స్ పోలియో చుక్కలకు కూడ  ఈ సిరాను వాడారు.  ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ చుక్కలు వేసిన తర్వాత  ఈ సిరాను వాడుతున్నారు.
 

click me!