Telangana Election Result 2023: ఇల్లెందులో కాంగ్రెస్ ఘనవిజయం, భారీ మెజారిటీతో గెలిచిన కనకయ్య

By Mahesh JujjuriFirst Published Dec 3, 2023, 12:09 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో రెండో విజయం నమోదయ్యింది. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనకయ్య ఘన విజయం సాధించారు. 


తెలంగాణ ఎన్నికల రిజెల్ట్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 60కి పైగా సీట్లలో మెజారిటీలో కొనసాగుతున్న కాంగ్రెస్..ఇప్పటికే రెండు సీట్లు గెలుచుకుంది. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనకయ్య .. భారీ మెజారిటీతో  గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్ధి హరిప్రియపై కోరం కనకయ్య 38 వేల భారీ బెజారిటీతో గెలుపొందరు. తెలంగాణాలో మొదటి ఫలితం ఆశ్వరావుపేట కాగా రెండో ఫలితం ఇల్లందు అయ్యింది. రెండు ఫలితాలు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచే ఉన్నాయి. 

ఇక ఇల్లెందు నుంచి గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్ నుంచే గెలిచారు. అప్పట్లో కేసీఆర్ ఆకర్ష్ లో భాగంగా ఆమె బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటమి చూశారు. ఇక కోరం కనకయ్య  తెలుగుదేశం నుంచి ఇల్లెందు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు కనకయ్య. 

Latest Videos

ఇక తెలంగాణాలో మొదటి ఫలితం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే నమోదు అయ్యింది. అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది.  కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ మొదటి నుంచి ఆదిత్యంలో కొనసాగుతున్నారు తెలంగాణలో తొలి ఫలితం వెలువడింది కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 28వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.  2023లో జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేసింది. 

లైవ్ అప్ డేట్స్
 

click me!