
Telangana election results 2023: చేవెళ్ల నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి కాలె యాదయ్య, బీజేపీ నుంచి కె. ఎస్, రత్నం, బీఎస్పీ నుంచి రాజా మహేంద్ర వర్మ, కాంగ్రెస్ నుంచి బీమ్ భరత్ పమేనా పోటీ చేశారు. కాగా ప్రస్తుతం చేవెళ్ల నియోజక వర్గంలో.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వెనక్కి నెట్టేసి బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య 76218 మొత్తం ఓట్లలో 268 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాలె యాదయ్య 33,552 ఓట్ల మెజర్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.ఎస్.రత్నంపై విజయం సాధించాడు. కాగా ఈ నియోజక వర్గంలో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 55.96 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా ఈ నియోజకవర్గం ప్రజలు కాలె యాదయ్యనే మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో మొత్తం 2,53,972 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 1,28,773 మంది పురుషులు ఉండగా 1,25,195 మంది మహిళలు ఉన్నారు. కాగా నలుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్