కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చిందా? కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫలితాల సరళి ఎలా ఉన్నది?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్కకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు ఎన్ని ఓట్లు పడ్డాయి? అందరూ విశ్లేషణలు చేసినట్టు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చారా? అనే అంశాలను చూద్దాం.
Also Read : Etela Rajender: ఈటల రాజేందర్‌కు భంగపాటు తప్పదా? రెండు చోట్లా వెనుకంజ
undefined
మధ్యాహ్నం 12 గంటల సమయానికి బర్రెలక్కకు పడే ఓట్లపై ఓ అంచనా ఏర్పడింది. పోస్టల్ బ్యాలెట్‌లో బర్రెలక్క లీడ్‌లో నిలిచారు. ఉద్యోగులు ఆమెకు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమైంది. అయితే.. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే ఆమెకు మొత్తంగా 735 వరకు ఓట్లు పడ్డాయి. మొత్తంగా ఆదివారం వెలువడిన ఫలితాల ప్రకారం బర్రెలక్కకు 5,754 ఓట్లు పడ్డాయి.
Also Read: రేవంత్ రెడ్డి విజయయాత్ర.. తెలంగాణ ఎన్నికల పరిణామాలు.. లైవ్ అప్‌డేట్స్
ఇక బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ పై కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు లీడ్ కనబరిచారు. చివరకు జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. జూపల్లికి మొత్తం 93,609 ఓట్లు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డికి 63,678 ఓట్లు పడ్డాయి. జూపల్లి సుమారు 30 వేల మెజార్టీతో గెలిచారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావు 20,389 ఓట్లతో నిలిచారు. నాలుగో స్థానంలో బర్రెలక్క 5,754 ఓట్లతో నిలిచారు.
దీంతో బర్రెలక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి జూపల్లి విజయానికి గండి కొడతారనే విశ్లేషణలు వాస్తవ దూరం అని తేలిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ ఘోర పరాజయం పాలయ్యారు. జూపల్లి సునాయసంగా గెలుపొందారు. అయినా.. ఈ ఎన్నికల్లో ఒక నిరసన గళం నిరుద్యోగుల తరఫున రాజీ లేకుండా పోరాడిందనేది మాత్రం చరిత్రలో నిలిచి ఉంటుంది. ఆ నిరసన గళం బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అని మరి చెప్పక్కర్లేదు.