Narendra Modi...కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ ఆరాటం: నిర్మల్ సభలో మోడీ

Published : Nov 26, 2023, 04:53 PM ISTUpdated : Nov 26, 2023, 05:06 PM IST
Narendra Modi...కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ ఆరాటం: నిర్మల్ సభలో  మోడీ

సారాంశం

తెలంగాణలో రెండు రోజులుగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  బీజేపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

నిర్మల్:ఆర్మూరు పసుపునకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేస్తామని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తెలిపారు.ఆదివారంనాడు నిర్మల్ లో జరిగిన  భారతీయ జనతా పార్టీ  విజయ సంకల్ప సభలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.బీజేపీ ప్రభుత్వం వస్తే నిజామాబాద్ ను పసుపు నగరంగా ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఫుడ్ పార్క్, టెక్స్ టైల్స్  పార్క్ లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని  నరేంద్ర మోడీ  చెప్పారు.  తెలంగాణలో  తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందని  ఆయన  ప్రశ్నించారు. నమ్మక ద్రోహం తప్ప బీఆర్ఎస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ది సుల్తాన్ ల పాలన అయితే బీఆర్ఎస్ ది  నిజాంల పాలన అని ఆయన విమర్శించారు.  కోట్ల రూపాయాల ఇరిగేషన్  ప్రాజెక్టుల నిర్మాణం  కుంభకోణమైందని  మోడీ ఆరోపించారు.కేసీఆర్ కు తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి చింత లేదన్నారు. తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ తహతహలాడుతున్నారని మోడీ విమర్శించారు.  తన కుటుంబం గురించే  కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. 

ప్రజలను కలవని, సచివాలయానికి  రాని సీఎం మనకు అవసరమా అని మోడీ తెలుగులో ప్రశ్నించారు.కారు స్టీరింగ్ ఎంఐఎంకు ఇచ్చి  కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని  నరేంద్ర మోడీ  చెప్పారు. పేదలకు గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటేనే గ్యారంటీ అని  ఆయన  చెప్పారు.

కేంద్రం ఇస్తున్న ఇళ్లను పేదలకు అందకుండా బీఆర్ఎస్ చేస్తుందని ఆయన  ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే  పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇది మోడీ గ్యారంటీ అని ఆయన  చెప్పారు. గత పదేళ్లలో 4 కోట్ల ఇళ్లను నిర్మించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.

also read:Telangana assembly Elections 2023:2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

కేంద్రం ఇస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ బ్రేకులు వేసిందని ఆయన విమర్శించారు.కేసీఆర్ సర్కార్ పేదల శత్రువు అని ఆయన విమర్శించారు. మోడీ గ్యారంటీ అంటే  గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీగా ఆయన పేర్కొన్నారు.నిర్మల్ లో బొమ్మల పరిశ్రమను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు.ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా గురించే మాట్లాడుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాత్రం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడరని మోడీ  విమర్శించారు.

also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?

మతం పేరిట ఐటీ పార్కులు పెడుతామని కాంగ్రెస్ హామీ ఇస్తుందన్నారు.ఓట్ల కోసమే కాంగ్రెస్ మతం పేరిట ఐటీ పార్కుల ఏర్పాటు హామీ ఇస్తుందని ఆయన  విమర్శించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మోడీ చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను   కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదగకుండా  చేసిందన్నారు.పేదలకు  ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. మరో ఐదేళ్లు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు సామాజిక న్యాయానికి వ్యతిరేకమని మోడీ విమర్శించారు.

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

ధరణి పేరుతో కేసీఆర్ సర్కార్ భూ మాఫియాను నడుపుతుందని మోడీ ఆరోపించారు. ధరణిని రద్దు చేసిన మీ భూమి పేరుతో  కొత్త పోర్టల్ ను తెస్తామని  ఆయన హామీ ఇచ్చారు.గిరిజన మహిళా రాష్ట్రపతి కాకూడదని బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రయత్నించాయని నరేంద్ర మోడీ విమర్శించారు.మొట్టమొదటిసారిగా గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను బీజేపీ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.

హైద్రాబాద్ లో రాంజీగోండ్ పేరు మీద గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని  మోడీ హామీ ఇచ్చారు.గిరిజనుల కోసం రూ. 24 వేల కోట్లతో  పీఎం జన్ ధన్ మాన్ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.గిరిజనుల బడ్జెట్ ను ఐదు శాతం పెంచామని మోడీ  చెప్పారు.ఎస్ సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని మోడీ గుర్తు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు