Nalgonda Election Results 2023: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు..కోమటిరెడ్డి గెలుపు

By narsimha lode  |  First Published Dec 3, 2023, 11:40 AM IST


నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.  బీఆర్ఎస్ అభ్యర్ధిగా కంచర్ల భూపాల్ రెడ్డి  పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.


నల్గొండ:  నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.  50 వేలకు పైగా మెజారిటీతో  వెంకట్ రెడ్డి గెలుపొందారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం  నెంబర్  92.  దక్షిణ తెలంగాణలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది.

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో  18.47 శాతం  ఎస్ సీ జనాభా ఉంటుంది.  ఎస్టీ జనాభా 1.3 శాతంగా ఉంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో  63.75 శాతం  అక్షరాస్యత ఉందని గణాంకాలు చెబుతున్నాయి. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో  2,37, 866 మంది ఓటర్లున్నారు. వీరిలో  1,16,487 మంది  పురుష ఓటర్లు,  1,21,326 మహిళా ఓటర్లున్నారు. 53 మంది ట్రాన్స్ జెండర్లు కూడ ఈ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. 2018 ఎన్నికల్లో  ఈ నియోజకవర్గంలో  2,16, 860 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

Latest Videos

undefined

also read:Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ...

2018 ఎన్నికల్లో  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై 23, 768 ఓట్ల మెజారిటీతో  బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపొందారు. 2018లో నల్గొండలో  ఓటమి పాలైన తర్వాత  2019 పార్లమెంట్ ఎన్నికల్లో  భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు.  .1999 నుండి  2018 వరకు  కాంగ్రెస్ అభ్యర్థిగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. 

also read:Khammam Election Result 2023: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగారు.  ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


 

click me!