తెలంగాణలో ప్రతి రోజూ మూడు నుండి నాలుగు ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.ఈ సభల్లో కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శల దాడిని తీవ్రం చేశారు.
ఆలంపూర్:ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు.ఆదివారంనాడు ఆలంపూర్ లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాల్గొన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను సరిదిద్దుకుంటూ వెళ్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు.
ఆర్డీఎస్ నుండి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా గతంలో ఎవరూ మాట్లాడలేదని కేసీఆర్ విమర్శించారు.పదవులపై ఆశతో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడలేదన్నారు.బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు.మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.తెలంగాణ రాకముందు పాలమూరు నుండి అధికంగా వలసలుండేవన్నారు.ప్రస్తుతం పాలమూరులో వచ్చిన పరిస్థితులను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ లో పెట్టిందని కేసీఆర్ విమర్శించారు.
Live: ప్రజా ఆశీర్వాద సభ, అలంపూర్ నియోజకవర్గం https://t.co/5Q1Xbja6xb
— BRS Party (@BRSparty)
undefined
పాలమూరులో కరువు రాకుండా చూసే బాధ్యత తనది కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రూ. 200లుగా ఉన్న పెన్షన్ ను రూ. 2 వేలకు పెంచిన విషయాన్నికేసీఆర్ గుర్తు చేశారు.మరోసారి బీఆర్ఎస్ కు అధికారమిస్తే పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
also read:కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం: నారాయణపేట సభలో జేపీ నడ్డా
రైతుబంధు వృధా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను కేసీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వృధానా, వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందా అని ఆయన ప్రజలను అడిగారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఉచిత విద్యుత్ ఉత్తమాటేనన్నారు.
also read:తెలంగాణ ఇవ్వకుండా మా పార్టీని చీల్చాలని చూశారు: కొల్లాపూర్ సభలో కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలంపూర్ నుండి గద్వాల వరకు తాను చేసిన పాదయాత్రను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విచక్షణతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని ఆయన కోరుకున్నారు.ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటేనని కేసీఆర్ చెప్పారు.