తెలంగాణ అభివృద్దిపై స్పష్టమైన విజన్: ఖానాపూర్ సభలో ప్రియాంక గాంధీ

By narsimha lode  |  First Published Nov 19, 2023, 1:08 PM IST


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు  పెద్ద ఎత్తున ప్రచార సభల్లో పాల్గొంటున్నారు


ఖానాపూర్:తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీకి ఓ విజన్ ఉందని  కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత ప్రియాంక గాంధీ చెప్పారు.ఆదివారంనాడు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు.

ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లు దాటినా  ఆమెను ఇంకా    ఈ ప్రాంత ప్రజలు  ఆరాధిస్తున్నారన్నారు.  ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని ఆమె గుర్తు చేశారు.  గిరిజనులు, ఆదీవాసీల కోసం  ఇందిరాగాంధీ అనేక కార్యక్రమాలు ప్రారంభించారన్నారు.  ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారన్నారు.  

Latest Videos

undefined

also read:డిపాజిట్లే రాని పార్టీ బీసీని సీఎం ఎలా చేస్తుంది: బీజేపీ బీసీ నినాదంపై రేవంత్ సెటైర్లు

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రియాంకగాంధీ చెప్పారు. సిద్దాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్ అని ప్రియాంకగాంధీ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడి దాదాపు పదేళ్లు కావస్తున్నా  ప్రజల కలలు నెరవేరలేదని ప్రియాంక గాంధీ చెప్పారు.ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారన్నారు. ఆదీవాసీ సంస్కృతి ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతిగా  ఆమె పేర్కొన్నారు.

యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కానీ తన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు కల్పించారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని  ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలు జాబ్ క్యాలెండర్ లో ఉంటాయని  ప్రియాంకగాంధీ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని  ప్రియాంక గాంధీ తెలిపారు.టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యం వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. 

జాబ్ క్యాలెండర్ లేక ఎంతోమంది నిరాశా, నిస్పృహలో ఉన్నారని ప్రియాంక గాంధీ చెప్పారు.
తమ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే  ఉద్యమ కారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.రూ. రెండు లక్షల పంట రుణాలను ఏకకాలంలో  రుణమాఫీ చేస్తామన్నారు.  పంటలకు మద్దతు ధరను పెంచుతామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

కేసీఆర్ సర్కార్ నిర్మించిన  ప్రాజెక్టుల్లో  కుంభకోణాలు జరిగాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు.కాళేశ్వరం, మిషన్ భగీరథలో  భారీగా అవినీతి జరిగిందన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్  కార్పోరేట్ సంస్థలకే  రుణమాఫీ చేస్తుందని ఆమె విమర్శించారు.రైతులు, కార్మికులకు రుణాలను మాత్రం కేంద్రం మాఫీ చేయదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయని  ప్రియాంక గాంధీ  ఆరోపించారు.తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేయాలని అధికారులను పంపుతున్నారని మోడీ సర్కార్ పై  ప్రియాంక గాంధీ  ఆరోపణలు చేశారు.బీజేపీ, బీఆర్ఎష్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయన్నారు.బీజేపీ, ఎంఐఎంకు ఓటేస్తే  బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.
 

click me!