Priyanka Gandhi...ఖమ్మంలో ప్రియాంక గాంధీ రోడ్ షో: పాల్గొన్న తెలుగుదేశం శ్రేణులు

Published : Nov 25, 2023, 08:08 PM ISTUpdated : Nov 25, 2023, 08:19 PM IST
Priyanka Gandhi...ఖమ్మంలో ప్రియాంక గాంధీ రోడ్ షో: పాల్గొన్న తెలుగుదేశం శ్రేణులు

సారాంశం

ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. రెండు రోజులుగా ప్రియాంక గాంధీ  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  ప్రియాంక గాంధీ రోడ్ షోలో  టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి.


ఖమ్మం: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ  శనివారంనాడు ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షో లో  టీడీపీ శ్రేణులు కూడ పాల్గొన్నాయి. తెలుగుదేశం పార్టీ  కార్యకర్తలు పసుపు పచ్చ జెండాలు పట్టుకుని ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.  పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించి  చివరగా  స్థానిక ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  పోటీ చేస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని  ప్రియాంక గాంధీ కోరారు. 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ అభ్యర్థులకు  తెలుగుదేశం పార్టీ  మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ ను ఓడించే శక్తి కాంగ్రెస్ అభ్యర్థులకు ఉందని   ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆపార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారని చెబుతారు.  బీఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

also read:Telangana assembly Elections 2023: ఓటరు గుర్తింపు కార్డు లేదా... ఈ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలో  ఈ దఫా  తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  రెండు అసెంబ్లీ స్థానాల్లో  టీడీపీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఇంకా ఓటు బ్యాంకు ఉంది. దీంతో  ఈ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వ్యూహత్మకంగా అడుగులు వేశారు. టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో  తమకు మద్దతివ్వాలని కోరారు. తొలుత ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ శ్రేణులు  తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతును ప్రకటించాయి. మధిర సహా  ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతును ప్రకటించాయి. 

also read:Priyanaka Gandhi...ఎవరు ఏ ఆట ఆడినా తెలంగాణలో కాంగ్రెస్‌దే గెలుపు: ప్రియాంక గాంధీ

ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో టీడీపీ శ్రేణులు తమ పార్టీ జెండాలతో  పాల్గొన్నారు.

also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?

ఖమ్మంలో  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షో లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ అభ్యర్థులకు  టీడీపీ  మద్దతు ప్రకటించింది. దీంతో  ప్రియాంక గాంధీ రోడ్ షో లో  టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు