దేశంలో పలువురు నేతలు వరుసగా మూడు దఫాలు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. కొందరు సీఎంలు నాలుగైదు దఫాలు ఈ పదవిలో కొనసాగారు.
హైదరాబాద్: దేశంలో పలువురు ముఖ్యమంత్రులు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు దఫాలు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సీఎంలున్నారు.
దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరున ఉంది. సుమారు 24 ఏళ్ల పాటు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
undefined
also read:Telangana Election Results 2023:2014, 2018 ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకున్న బీఆర్ఎస్
1994 డిసెంబర్ ఐదవ తేదీన సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2019 మే 26వ తేదీ వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. సిక్కిం రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు ఈ రికార్డును ఇంకా అధిగమించలేదు. ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 23 ఏళ్లు దాటింది.కొన్ని రోజుల్లో ఈ రికార్డును నవీన్ పట్నాయక్ బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదు.
2000 మార్చి 5వ తేదీన ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఇంకా కొనసాగుతున్నారు. ఒడిశా సీఎంగా ఆయన వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు.
also read:Longest serving Chief Ministers:అత్యధిక కాలం సీఎంలుగా.. పవన్ కుమార్, నవీన్ పట్నాయక్..జ్యోతిబసు
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 2001 అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.2002లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయంలో నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారు.
2002 డిసెంబర్ 22 నుండి 2007 డిసెంబర్ 22వరకు, 2007 డిసెంబర్ 23 నుండి 2012 డిసెంబర్ 20వరకు, 2012 డిసెంబర్ 20 నుండి 2014 మే 22 వ తేదీ వరకు ఆయన సీఎంగా కొనసాగారు.
1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు.ఢిల్లీలో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్న తర్వాత ఆ పార్టీ బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆప్ భర్తీ చేసింది.
1998 నుండి 2018 వరకు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ కొనసాగారు. వరుసగా ఆయన త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అత్యంత నిరుపేద సీఎంగా మాణిక్ సర్కార్ రికార్డు సృష్టించారు. మాణిక్ సర్కార్ భార్య బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి జ్యోతిబసు సుధీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1977 జూన్ 21 నుండి 2011 మే13 వ తేదీ వరకు జ్యోతిబసు బెంగాల్ సీఎంగా కొనసాగారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యకు సీఎం పదవిని ఆయన అప్పగించారు. ఆరోగ్య కారణాలతో బెంగాల్ సీఎం పదవిని జ్యోతిబసును తప్పించింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడు దఫాలు సీఎం పదవిని దక్కించుకున్నారు. 2005 నుండి 2018 వరకు వరుసగా మూడు దఫాలు విజయం సాధించారు.2020 నుండి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వరుసగా మూడు దఫాలు సీఎం పదవిలో కొనసాగారు.2003 డిసెంబర్ 7 నుండి 2018 డిసెంబర్ 17 వరకు మూడు దఫాలు ఛత్తీస్ ఘడ్ సీఎం పదవిలో రమణ్ సింగ్ కొనసాగారు.
ఇదిలా ఉంటే వరుసగా 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వరుసగా మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని దక్కించుకొని కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అనేది డిసెంబర్ 3న తేలనుంది