telangana assembly election results : ఆదివారం సాయంత్రం నాటికి తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతీ అభ్యర్థి వెంట ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం నియమించనుంది. గెలిచిన వెంటనే ఎన్నికల అధికారులు అందజేసే సర్టిఫికెట్ ను ఎమ్మెల్యే దగ్గర నుంచి వారే తీసుకోనున్నారు. వాటితో ఏం చేయనున్నారంటే ?
telangana assembly election results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరు గెలుస్తారు ? ఏ పార్టీ అధికారం చేపడుతోందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నలుగురు ఒక్క చోట కలిస్తే చాలా వారి మధ్య ఇదే టాపిక్ పై చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపడుతుందా ? లేక కాంగ్రెస్ గెలుస్తుందా ? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి ? కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారనే విషయాలే మాట్లాడుకుంటున్నారు.
పోలింగ్ పూర్తయిన తరువాత వెలువడిన అనేక ఎగ్జిట్స్ పోల్స్ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీ సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. కచ్చితత్వాన్ని సరిగ్గా అంచనా వేస్తుందనే ట్రాక్ రికార్డు ఉన్న ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ కూడా శుక్రవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ సంస్థ కూడా కాంగ్రెస్ కే అధికారం దక్కనుందని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఈ ఇవన్నీ ఫేక్ అని, మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారే రాబోతోందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ధీమాతో ఉన్నారు.
undefined
ఏదీ ఏమయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ కే అనుకూలంగా ఉండటంతో అధిష్టానం అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఆదివారం కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ప్రతీ అభ్యర్థి వెంట ఏఐసీసీ పరిశీలకులు ఉండాలని నిర్ణయించింది.
అభ్యర్థి గెలిచిన వెంటనే ఎన్నికల అధికారులు అందజేసే సర్టిఫికెట్ ను వారు ఎమ్మెల్యే దగ్గర నుంచి సేకరించనున్నారు. అనంతరం ఆ సర్టిఫికెట్ ను తీసుకొని నేరుగా హైదరాబాద్ లో ఉన్న తాజ్ కృష్ణ కి వెళ్లనున్నారు. తరువాత ఏం చేయాలన్న విషయం పార్టీ అధిష్టానం నిర్ణయించనుంది. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ చూసుకోనున్నారు. ఇలాంటి పరిస్థితులను సునాయాసంగా డీల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే ఈ రోజు (శనివారం) సాయంత్రం 8 గంటలకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఆయన తెలంగాణలోనే ఉండనున్నారు. తరువాత గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కర్ణాటక కు తరలించి, అక్కడ క్యాంప్ లో ఉంచనున్నట్టు తెలుస్తోంది.