కాంగ్రెస్ కు సంభాని చంద్రశేఖర్ కు షాక్: రాజీనామా, బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి

By narsimha lode  |  First Published Nov 10, 2023, 1:07 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. 


హైదరాబాద్: మాజీ మంత్రి  సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ టిక్కెట్టును సంభాని చంద్రశేఖర్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం సంభాని చంద్రశేఖర్ కు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో  ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.పార్టీలో తనను అవమానించారని ఆ లేఖలో  సంభాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వరుస అవమానాలతో బాధపడ్డానని సంభాని చంద్రశేఖర్ చెప్పారు. 

Latest Videos

undefined

సంభాని చంద్రశేఖర్  అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ నేతలు  ఆయనతో సంప్రదింపులు జరిపారు. భారత రాష్ట్రసమితికి చెందిన  ఎంపీలు  నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు సంభాని చంద్రశేఖర్ తో సంప్రదింపులు జరిపారు.  బీఆర్ఎస్ లో సంభాని చంద్రశేఖర్ చేరేందుకు ఆసక్తిని చూపారు.

రెండు రోజులుగా  సంభాని చంద్రశేఖర్ తన అనుచరులతో సమావేశాలునిర్వహిస్తున్నారు.   టిక్కెట్టు దక్కని కారణంగా  పార్టీ మారాలని అనుచరులు  సంభాని చంద్రశేఖర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదే సమయంలో  బీఆర్ఎస్ నేతలు కూడ సంభాని చంద్రశేఖర్ కు గాలం వేశారు.   ఈ పరిణామాలతో  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే  సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇవాళ  తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.

also read:జగదీష్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టిక్కెట్టు ఇవ్వలేదు: కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి సంచలనం

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి సంభాని చంద్రశేఖర్ గతంలో  ప్రాతినిథ్యం వహించారు.  గతంలో  కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సంభాని చంద్రశేఖర్ మంత్రిగా కూడ పనిచేశారు. 

పాలేరు అసెంబ్లీ స్థానంలో  సంభాని చంద్రశేఖర్ కు మంచి పట్టుంది.  ఈ సమయంలో సంభాని చంద్రశేఖర్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ కు ఏ మేరకు నష్టం కల్గిస్తుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ నుండి  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు  ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే దక్కింది.  ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకొనేందుకు  బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ అసంతృప్తులకు గాలం వేస్తుంది.

click me!