పాలేరు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా కందాల ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగారు. సీపీఐ(ఎం) అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం పోటీలో ఉన్నారు.
పాలేరు:పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.పాలేరు అసెంబ్లీ స్థానం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉంది. దక్షిణ తెలంగాణలో పాలేరు అసెంబ్లీ స్థానం ఉంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 113.పాలేరులో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 47 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానం నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తుమ్మల నాగేశ్వరరావుపై కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాతి పరిణామాల్లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
undefined
మొత్తం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,92,820 మంది ఓటర్లున్నారు.95,001 మంది పురుషులు,97,802 మంది మహిళా ఓటర్లున్నారు.2018 ఎన్నికల్లో 90.99 శాతం, 2014లో 90.32 శాతం పోలింగ్ నమోదైంది.
also read:Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ...
ఈ ఏడాది ఏప్రిల్ లో మాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది జూన్ మాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం బరిలోకి దిగారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) మధ్య పొత్తు చర్చలు జరిగాయి. అయితే కాంగ్రెస్ అవలంభించిన విధానాల కారణంగా పొత్తు చర్చలు విఫలమైనట్టుగా సీపీఐ(ఎం) ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్రంలోని 19 స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ చేసింది.
also read:Nalgonda Election Results 2023: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు