Sabitha Indra Reddy: దేశంలోనే తొలి మహిళా హోం మంత్రి.. విజయానికి కేరాఫ్ సబితా ఇంద్రారెడ్డి

By Mahesh KFirst Published Dec 1, 2023, 9:25 PM IST
Highlights

సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తే విజయం తలుపుతట్టాల్సిందే. పోటీ చేసిన ప్రతిసారీ బంపర్ మెజార్టీతో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి మళ్లీ బరిలో నిలిచారు. ఆమె భర్త ఇంద్రారెడ్డి ఘనత, ఆమె రాజకీయ ప్రవేశం, ప్రస్థానం వంటి విశేషాలను తెలుసుకుందాం.
 

హైదరాబాద్: పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి దేశస్థాయిలో రికార్డులు తిరగరాశారు. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా రికార్డుకెక్కారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా నిలిచారు. సబితా ఇంద్రారెడ్డి అనుకోకుండా రాజకీయ రంగప్రవేశం చేశారు గానీ, పోటీ చేస్తే అపజయం ఎరుగని సబితా ఇంద్రారెడ్డి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

వ్యక్తిగత జీవితం:

మెదక్ జిల్లాలో 1963 మే 5వ తేదీన మహిపాల్ రెడ్డి, వెంకటమ్మ దంపతులకు సబితా ఇంద్రారెడ్డి జన్మించారు. గ్రామంలోనే విద్యాభ్యాసం ప్రారంభించినా ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఉస్మానియాలో చదువుకుంటూ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఇంద్రారెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే చిన్న వయసులోనే 1982లో పెళ్లి జరిగింది. సబితా ఇంద్రారెడ్డికి 20 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు.

Also Read: Gangula Kamalakar: వెలమల కోటలో బీసీ గొంతుక.. మాస్ లీడర్ గంగుల కమలాకర్ బయోడేటా

రాజకీయ ప్రవేశం:

పి ఇంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. లోక్ దళ్ నుంచి పోటీ చేసి ఓడిపోయి టీడీపీ టికెట్ పై చేవెళ్ల నుంచి విజయఢంకా మోగించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్‌లో హోం సహా పలు పోర్ట్‌ఫోలియోలు నిర్వహించారు. టీడీపీ సంక్షోభం తర్వాత కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన 2000లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వచ్చిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరి జైత్రయాత్ర ప్రారంభించిన ఆమె వైఎస్ఆర్‌కు చివరి వరకు దత్తత చెల్లిగానే మెలిగారు. ఇప్పటికీ వైఎస్ఆర్‌ను అన్నగానే సంబోధిస్తారు.

Also Read: CM KCR: కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చినా 4న కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా?

జైత్రయాత్ర:

2004లోనూ చేవెళ్ల నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలిచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో చేవెళ్ల ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో మహేశ్వరం స్థానం నుంచి 2009లో పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భర్త ఇంద్రారెడ్డి తరహాలోనే ఆమె కూడా హోం మంత్రి పదవికే వన్నెతెచ్చారని చెబుతారు. ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన నేతల్లో ఇంద్రారెడ్డిని ఇప్పటికీ స్మరిస్తూ ఉంటారు.

Also Read: Telangana Elections: మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. గులాబీ శిబిరం ధైర్యం ఇదే

2014లో తనయుడు కార్తిక్ రెడ్డి కోసం పోటీకి దూరంగా ఉన్నా.. 2018లో గెలిచి 2019లో టీఆర్ఎస్‌లో చేరారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ మహేశ్వరం నుంచి బరిలో దిగారు. పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో గెలిచే సబితా ఇంద్రారెడ్డి ఈ సారి కూడా తానే గెలుస్తాననే విశ్వాసంతో ఉన్నారు.

click me!