telangana assembly Elections 2023: టెండర్ ఓటు అంటే ఏమిటీ?

Published : Nov 28, 2023, 09:54 AM IST
 telangana assembly Elections  2023: టెండర్ ఓటు అంటే ఏమిటీ?

సారాంశం

పోలింగ్ స్టేషన్లో చాలెంజ్ చేసి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని  ఎన్నికల సంఘం కల్పించింది.  టెండర్ ఓటును లెక్కించరు. కోర్టు ఆదేశాలిస్తే ఈ ఓటును లెక్కిస్తారు.

హైదరాబాద్: టెండర్ ఓటు గురించి  పోలింగ్ సమయంలో వినే ఉంటాం.  టెండర్ ఓటు లేదా  ఛాలెంజ్ ఓటుగా దీన్ని పిలుస్తారు.  తమ ఓటును హక్కును వినియోగించుకొనేందుకు ఛాలెంజ్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవడమే టెండర్ ఓటు.  ఎన్నికల సంఘం  42 సెక్షన్  ప్రకారంగా  టెండర్  ఓటును వినియోగించుకొనే  అవకాశం ఉంది.

పోలింగ్ స్టేషన్లలో  పోటీలో ఉన్న  అభ్యర్థుల తరపున ఎన్నికల ఏజంట్లు  ఉంటారు.  ఓటింగ్ హక్కును వినియోగించుకొనేందుకు వచ్చిన ఓటరు నకిలీ ఓటరుగా అనుమానించిన సమయంలో  ఎన్నికల ఏజంట్లు  అతడిని లేదా ఆమెను  ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అభ్యంతరం చెబితే   టెండర్ ఓటును వినియోగించుకొనే వెసులుబాటు  ఉంటుంది.   టెండర్ ఓటును  వినియోగించుకొనేందుకు  ప్రిసైడింగ్ అధికారి అవకాశం కల్పిస్తారు.

తన వద్ద ఉన్న  ఓటరు ధృవీకరణ కార్డు, లేదా  తన గుర్తింపును తెలిపే  కార్డును పరిశీలించి ఓటు హక్కు కల్పించేందుకు ప్రిసైడింగ్ అధికారి  అవకాశం కల్పిస్తారు.   ఒకవేళ ఎన్నికల ఏజంట్ లేవనెత్తిన అభ్యంతరం మేరకు ఓటరు నకిలీ లేదా  ఓటు హక్కు కోసం వచ్చిన వారి నుండి సరైన ఆధారాలు లేకపోతే  ఓటు హక్కును నమోదు చేసుకొనేందుకు  అనుమతిని ఇవ్వరు. టెండర్ ఓటును ఈవీఎం ద్వారా వినియోగించుకొనే వీలుండదు.  టెండర్ ఓటును బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చు.

also read:Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి

టెండర్ చేసిన బ్యాలెట్ పేపర్ ను ఓటరుకు ఇచ్చే ముందు  ఓటరు తన పేరును ఫారం  17 బీలో నమోదు చేయాల్సి ఉంటుంది.  బ్యాలెట్ పేపర్ పై ఓటు వేసిన తర్వాత   ఆ పేపర్ ను  ఓటరు ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి.  ఈ బ్యాలెట్ పేపర్ ను  ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకమైన కవర్లో ఉంచాలి.టెండర్ ఓట్లను  ఫారం సీ లో  ప్రిసైడింగ్ అదికారి  నమోదు చేయాలి.

also read:Telangana assembly Elections 2023: ఓటరు గుర్తింపు కార్డు లేదా... ఈ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

1961 సాధారణ  కౌంటింగ్ ప్రక్రియలో  టెండర్ ఓట్లను లెక్కించరు.  టెండర్ బ్యాలెట్ పత్రాలను కలిగి ఉన్న కవర్ కౌంటింగ్ సమయంలో తెరవరు.మరోవైపు  1951 సెక్షన్ 83 ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తే  టెండర్ ఓట్లను లెక్కించాలని కోర్టులు ఆదేశిస్తే  ఆ ఓట్లను లెక్కిస్తారు. 

 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు