తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరీంనగర్ లో జరిగిన సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మూడు రోజులుగా ఎన్నికల సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు
కరీంనగర్:హుజూరాబాద్ ప్రజలు గతంలోనే ఫామ్ హౌస్ సీఎంకు ట్రైలర్ చూపించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఫామ్ హౌస్ సీఎంకు పూర్తి సినిమా చూపిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.సోమవారంనాడు కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని ప్రధాని మోడీ చెప్పారు.పీవీని కాంగ్రెస్ ప్రతి అడుగులో అవమానించిందన్నారరు. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే, ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీఆర్ఎస్ లో చేరుతారో తెలియదన్నారు.
undefined
Telangana is fully aware that Congress and BRS want power in the state to fill their coffers rather than serving the people. Addressing a rally in Karimnagar. https://t.co/cZaqXabI2t
— Narendra Modi (@narendramodi)ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టడం లేదన్నారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తుంది... మార్పు వస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.చరిత్రలోని 16 మహా జనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతమని మోడీ గుర్తు చేశారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ ను మళ్లీ గద్దెనెక్కించడమేనని ఆయన చెప్పారు. ఈ కుటుంబ పాలకులు ఎప్పుడూ తమ కుటుంబం, పిల్లల గురించి ఆలోచిస్తారన్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించరన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లు.వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని మోడీ పేర్కొన్నారు.పదేళ్ల బాలుడి పేరేంట్స్ అతని భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిస్తారన్నారు. తెలంగాణ వచ్చే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ కావాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్దికి ఓటేయాలంటే బీజేపీకే ఓటేయాలని మోడీ చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పీఎఫ్ఐ వంటి సంస్థల కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. పిలిగ్రీ వంటి కళను కరీంనగర్ ప్రసిద్ది చెందిందన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఈ కళ కోసం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఓవైపు ఫాంహౌస్ పాలకుడు, మరో వైపు మీ సేవకుడు మోడీ ఉన్నారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పీఎఫ్ఐ వంటి సంస్థల కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. పిలిగ్రీ వంటి కళను కరీంనగర్ ప్రసిద్ది చెందిందన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఈ కళ కోసం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఓవైపు ఫాంహౌస్ పాలకుడు, మరో వైపు మీ సేవకుడు మోడీ ఉన్నారని ఆయన చెప్పారు.
దేశానికి మార్గనిర్దేశం చేసిన పీవీని ప్రధానిగా తెలంగాణ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎంతగానో అవమానించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రతిష్టను బీజేపీ మాత్రమే పెంచుతుందని మోడీ తెలుగులో చెప్పారు.
కేసీఆర్ సర్కార్ కు బుద్ది చెప్పాలంటే బీజేపీకే ఓటేయాలని ఆయన కోరారు.కేసీఆర్ కుటుంబం అవినీతి చేసుకొనేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు బదులు కన్నీళ్లు, మోసాాలు, నిరుద్యోగులు ఇచ్చారని ఆయన కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను నమ్మొద్దని ఆయన కోరారు. బీజేపీ, తనను నమ్మాలని మోడీ కోరారు.ఒక రోగానికి విరుగుడు మరో రోగం కాదన్నారు.ఇరిగేషన్ స్కాం దోషులను జైలుకు పంపేందుకు బీజేపీకి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని ఆయన తెలుగులో ప్రసంగించారు.ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీకి ఓటేయాలని ఆయన కోరారు.