తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. ఇవాళ తెలంగాణలో ప్రచారానికి ప్రియాంక గాంధీ వచ్చారు. రాష్ట్రంలోని గద్వాల సభలో ఆమె ప్రసంగించారు.
గద్వాల:అవినీతి తప్ప పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు.కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆమె చెప్పారు.
గద్వాలలో సోమవారంనాడు నిర్వహించిన విజయభేరి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. పేదల భూములను కాజేశారు, అప్పుల పాలు చేశారని ఆమె బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కలలు కన్నారన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో యువత నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుందని ప్రియాంక గాంధీ చెప్పారు. ఈ ప్రభుత్వం మహిళలకు తగిన న్యాయం చేయడం లేదన్నారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
LIVE: Public Meeting | Gadwal, Telanganahttps://t.co/vV9chchyhO
— Priyanka Gandhi Vadra (@priyankagandhi)రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు కష్టాలు వచ్చిన సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలవలేదన్నారు. తెలంగాణలో ధనిక పార్టీ బీఆర్ఎస్ అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ కు ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు.ఈ డబ్బు ఎవరిదని ఆమె అడిగారు. కేసీఆర్ దగ్గరున్నదంతా ప్రజల డబ్బేనని ఆమె చెప్పారు. స్వరాష్ట్రంలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయన్నారు.
also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ
అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన కలలు నెరవేరుతాయని భావించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మన కలలు నెరవేరాయా అని ఆమె ప్రశ్నించారు.ఎంతోమంది యువత పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సాకారమైందని ప్రియాంక గాంధీ చెప్పారు.