ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని ఆరోపించారు.
దేశంలో 24 గంటల పాటు కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేకపోవడంతో ఎంత ఇబ్బంది పడ్డామో రైతులందరూ గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు 3 గంటలు కరెంటు చాలని అంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే అని ఆరోపించారు. సోమవారం ఆయన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని వెల్గటూర్ లో రోడ్ షోలో పాల్గొన్నారు.
పేదల తరఫున మాట్లాడినందుకే ఈటలను బయటకు పంపారు - హుజూరాబాద్ సభలో అమిత్ షా..
undefined
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే మరో సారి రైతుబంధును నిలిపివేశారని చెప్పారు. ఈ పరిణామంతో రైతులెవరూ ఆందోళన చెందకూడదని సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ తెలంగాణ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని హామీ ఇచ్చారు.
వాహనాల్లో నుంచి రోడ్లపైకి కరెన్సీ నోట్లు వెదజల్లిన యువకులు.. వీడియో వైరల్..
ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి సూచించారు. 24 గంటల కరెంట్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా పీఎఫ్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి తెలిపారు.
డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం..
అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని బట్టి విక్రమార్క మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రైతుబంధు దుబారా అని అన్నారని, అది సిగ్గు చేటని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పది రోజుల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కార్ అని అన్నారు. కేసిఆర్ పాలనే ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు. ఏడావాలని అనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, నవ్వాలని అనుకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.